Pushpa 2 Teaser :ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా కొద్దీ ఫ్యాన్స్‌లో ఉత్కంఠ పెరిగిపోతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయమని సినీవర్గాలు టాక్. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందే ఓ అరుదైన రికార్డు సాధించింది. తెలుగు చిత్రపరిశ్రమలో ఏ సినిమా సాధించని ఘనత పుష్ప 2 అందుకుంది. అదేంటంటే
బన్నీ బర్త్ డే సందర్భంగా పుష్ప మేకర్స్ 2024 ఏప్రిల్ 8న ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. గంగమ్మ జాతర ఫైట్ సీన్‌తో ఈ టీజర్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది. తాజాగా ఈ టీజర్ యూట్యూబ్‌లో అన్ని భాషల్లో కలిపి 150 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. కేవలం తెలుగులోనే దాదాపు 120 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. దీంతో టాలీవుడ్లోనే అత్యధిక వ్యూస్ సాధించిన టీజర్‌గా పుష్ప 2 రికార్డు కొట్టింది. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు.
అది కూడా రికార్డే!
అలాగే ఈ సినిమా రిలీజ్ రోజే మరో అదుదైన రికార్డు ఖాతాలో వేసుకోనుంది. ఈ సినిమాను వరల్డ్‌వైడ్‌గా 11,500 స్ర్రీన్లలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. తెలుగు సహా ఆరు భాషల్లో కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 11,500 స్ర్రీన్లలో విడుదల కానుంది. అందులో భారత్‌లో 6500 కాగా, ఓవర్సీస్లో 5000 స్క్రీన్లు ఉన్నాయి. అయితే అల్లు అర్జున్‌కు వరల్డ్‌వైడ్‌గా ఉన్న ఫ్యాన్స్‌ను దృష్టిలో ఉంచుకొని మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇప్పటివరకు భారతీయ సినీ చరిత్రలో ఏ సినిమా కూడా ఇన్ని స్క్రీన్లలో రిలీజ్ కాలేదని విశ్లేషకులు అంటున్న మాట. దీంతో 'పుష్ప 2' ఓపెనింగ్ డే రోజే మరో రికార్డు సృష్టించడం లాంఛనమే.