Pushpa 2 Shooting Completed :ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందుతున్న 'పుష్ప: ది రూల్' సినిమా షూటింగ్ తాజాగా కంప్లీట్ అయ్యింది. ఈ క్రమంలో బన్నీ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. " లాస్ట్ డే షూటింగ్. అద్భుతమైన ఐదేళ్ల 'పుష్ప' ప్రయాణం పూర్తయింది" అంటూ ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. దాంతో పాటు షూట్‌కు సంబంధించిన ఓ ఫొటోను కూడా షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం అది కాస్త నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
రన్‌టైమ్ ఎంతంటే?
మరోవైపు 'పుష్ప 2' రన్‌టైమ్ పార్ట్ 1 కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం దాదాపు 3 గంటల 21 నిమిషాల నిడివితో ఉంటుందట. ప్రస్తుతం ఈ వార్త కూడా బాగా వైరల్ అవుతోంది. ఇక తొలుత అనుకున్న స్క్రిప్ట్‌నే ఇంకాస్త్ మెరుగుపరిచి, దానికి ఇంకాస్త మరిన్ని మెరుగులు దిద్ది 'పుష్ప: ది రూల్'ను రెడీ చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్, ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే పెంచేశాయి.
తాజాగా వచ్చిన ట్రైలర్లో జాతర ఫైట్, మాస్ సీన్స్‌కు అభిమానులు బాగా కనెక్ట్ అయ్యారు. అంతేకాకుండా కొన్ని ట్విస్ట్‌లు, మరికొన్ని కొత్త క్యారెక్టర్ల పరిచయంతో ఆ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా సాగింది. ఈ క్రమంలో అన్ని భాషల్లోనూ మిలియన్స్‌కు పైగా వ్యూవ్స్‌తో ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంది ఈ ట్రైలర్.