Allu Arjun Speech In Pushpa 2 Pre Release Event :ఐకాన్ స్టార్అల్లు అర్జున్ లీడ్ రోల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'పుష్ప 2'. ఇప్పటికే పార్ట్ 1తో అలరించిన ఈ చిత్రం ఇప్పుడు ప్రీక్వెల్‌గా వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ తాజాగా హైదరాబాద్‌లోని పోలీస్‌గ్రౌండ్స్ (యూసఫ్‌గూడ)లో ఓ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. దీని స్టార్ డైరెక్టర్ రాజమౌళి స్పెషల్ గెస్ట్‌గా వచ్చారు. ఇక ఈ ఈవెంట్లో బన్నీ తన ఫ్యాన్స్ కోసం ఓ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు.
"నా అభిమానులను నేను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను. వారంటే నాకు అంత పిచ్చి. ఇక మాపై నమ్మకంతో ఖర్చు విషయంలో ప్రోడ్యూసర్లు ఎక్కడా రాజీ పడలేదు. ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ అద్భుతంగా నటించారు. ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత మీరంతా స్టన్ అవుతారు. శ్రీలీల డ్యాన్స్ చూస్తే, భలే క్యూట్‌గా అనిపిస్తుంది. ఆమెతో వర్క్ చేసిన తర్వాత తన టాలెంట్ ఏంటో నాకు తెలిసింది. నేను ఐదేళ్లుగా శ్రీవల్లితో పనిచేస్తున్నాను. ఇక షూటింగ్‌లో ఆమె లేని రోజులు నేను అసలు ఊహించలేను. రాత్రి 2గంటల వరకూ 'పీలింగ్స్' సాంగ్ చేసి, మళ్లీ పొద్దున్నే ఎనిమిదిన్నరకల్లా సెట్స్‌కు వచ్చేసేది. తను వరుసగా రెండు రోజుల పాటు సరిగా నిద్రకూడా పోలేదు. ఇటువంటి అమ్మాయిలతో పనిచేయాలన్న ఫీలింగ్ కలిగించింది" అంటూ తన కో స్టార్స్‌ను పొగడ్తలతో ముంచెత్తారు అల్లు అర్జున్.
ఇక ఇదే వేదికపై డైరెక్టర్ సుకుమార్ గురించి అలాగే తనతో వర్క్ చేసిన అనుభవాలను పంచుకున్నారు బన్నీ. సినిమా కోసం సుకుమార్ పడిన కష్టం గురించి చెప్పుకొచ్చారు. అలాగే తన ఫ్యాన్స్‌ను ఉద్దేశించి ఎమోషనల్‌గా మాట్లాడారు.