తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'రాజాసాబ్'​పై నిర్మాత ఇంట్రెస్టింగ్ అప్డేట్​ - సినిమాలో ఆ ఎలిమెంట్స్​కు పెద్ద పీట - Prabhas Rajasaab - PRABHAS RAJASAAB

Prabhas Rajasaab Update : ప్రభాస్ 'రాజాసాబ్' చిత్రంపై నిర్మాత విశ్వ ప్రసాద్‌ కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. పూర్తి వివరాలు స్టోరీలో

source ETV Bharat
Prabhas Rajasaab Update (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 23, 2024, 10:25 AM IST

Prabhas Rajasaab Update : ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్​ జోష్‌ మీదున్నారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఇప్పుడాయన చేతిలో ఉన్న సినిమాల్లో 'రాజాసాబ్‌' కూడా ఒకటి. మారుతి దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది. రొమాంటిక్‌ హారర్‌ కామెడీగా రానున్న ఈ మూవీ గురించి తాజాగా చిత్ర నిర్మాత విశ్వప్రసాద్‌ కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. ఇప్పటి వరకు ప్రభాస్‌ చేసిన సినిమాలన్నింటి కన్నా ఈ చిత్రం చాలా పెద్ద విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

"మేము సైలెంట్‌గా వస్తాం. పెద్ద సక్సెస్ సాధిస్తాం. ఈ చిత్రాన్ని ప్రారంభించినప్పుడు ప్రభాస్​ లైనప్​లో చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. ఇక ఈ మూవీ షూటింగ్ చాలా సైలెంట్‌గా మొదలై జరుగుతోంది. నిజానికి ఇది చాలా పెద్ద సినిమా. ఈ చిత్రం కోసం 38,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సెట్‌ వేశాం. ఇప్పటివరకు ఇండియాలో ఇంత భారీ సెట్‌ ఏ చిత్రానికి వేయలేదు. హారర్‌, రొమాంటిక్, యాక్షన్‌ ఇలా అన్ని ఎలిమెంట్స్‌ సినిమాలో ఉంటాయి. వీఎఫ్‌ఎక్స్​కు పెద్దపీట వేశాం. మ్యూజిక్​ కూడా నెక్స్ట్​ లెవల్​లో ఉంటుంది. ఫైట్స్‌, ఎఫెక్ట్స్‌ అన్నీ బాగుంటాయి" అని విశ్వ ప్రసాద్ చెప్పారు. దీంతో ప్రభాస్​ అభిమానుల్లో మరింత అంచనాలు పెరిగాయి.

కాగా, మారుతి - ప్రభాస్‌ కాంబోలో రాబోతున్న మొదటి చిత్రమిది. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్‌, మాళవిక మోహన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 2025 ఏప్రిల్‌ 10న మూవీ రిలీజ్​ కానుంది. ఇప్పటికే 'ఫ్యాన్‌ ఇండియా గ్లింప్స్‌' పేరుతో రిలీజైన స్పెషల్ వీడియో ఫ్యాన్స్​ను బాగా ఆకట్టుకుంది. నిమిషంలోపు నిడివి ఉన్న ఆ వీడియోలో ప్రభాస్‌ స్టైలిష్​ లుక్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియుల్ని బాగా అలరించింది.

Producer Viswa Prasad Mr Bachchan Review : అలానే తాజాగా రిలీజైన రవితేజ మిస్టర్‌ బచ్చన్‌ రిజల్ట్​పై కూడా విశ్వ ప్రసాద్ మాట్లాడారు. "మిస్టర్ బచ్చన్ రిజల్ట్​పై కొన్ని ఎలిమెంట్స్​ తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్‌లలో రన్​ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఎక్కువగా మాట్లాడటం సరికాదు. నేను కూడా సినిమా చూశాను. కొన్ని సన్నివేశాల్లో హిందీ సాంగ్స్​ను ఉపయోగించకపోతే బాగుండేదనిపించింది. ఫస్ట్‌ హాఫ్ ఓకే. రెండో భాగంలో కొన్ని మార్పులు చేసుంటే రిజల్ట్​ మరోలా ఉండేది." అని చెప్పుకొచ్చారు.

ప్రభాస్​ ఫ్యాన్స్​కు అదిరే అప్డేట్​ - వరే వరే వరే వచ్చేశాడు రాజా సాబ్ - Rajasaab Movie

భైరవ, రాయన్ వచ్చేశారు - ఈ వీకెండ్​ OTTలో ఇంకా ఏఏ క్రేజీ మూవీస్​ ఉన్నాయంటే? - This Week OTT Releases

ABOUT THE AUTHOR

...view details