Priyanka Chopra House : యూఎస్‌లో స్థిరపడ్డ ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా దంపతులు తాము ప్రస్తుతం ఉంటున్న నివాసాన్ని ఖాళీ చేశారట. అయితే ఇందుకు గల కారణాలను తెలుపుతూ అక్కడి స్థానిక మీడియాలో పలు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే ?
అసలేం జరిగిందంటే ?
బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియాంకా చోప్రా. అమెరికాకు చెందిన పాప్ సింగర్ నిక్ జొనాస్‌ను వివాహం చేసుకొని యూఎస్‌లో స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో లాస్ ఏంజిలెస్‌లో 20 మిలియన్ డాలర్లు వెచ్చించి ఓ విలాసవంతమైన విల్లాను కొన్నారు. ఇందులోనే భర్త, బిడ్డతో ఆమె ప్రస్తుతం ఉంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం వాళ్లు ఉన్న ఆ భవనాన్నిఖాళీ చేశారట. దీంతో ఏం జరిగిందంటూ అందరూ ఆరా తీయడం మొదలెట్టారు.
తీరా చూస్తే ఆ ఇంట్లోని అనేక ప్రదేశాల్లో నీళ్లు లీక్ అవుతున్నాయని, దాని వల్ల ఇంట్లోని చాలా ప్రాంతాలు దెబ్బతిన్నాయని ప్రియాంక దంపతులు ఆ ఇంటిని వీడారంటూ ఇంగ్లీష్ పత్రికల్లో కథనాలు వెలువడుతున్నాయి.అంతే కాకుండా తమకు ఇళ్లు అమ్మిన వ్యక్తి నుంచి నష్ట పరిహారం ఇప్పించాలంటూ ప్రియాంక కోర్టులో దావా కూడా వేశారట. అయితే ఈ విషయంపై అటు ప్రియాంక గానీ ఇటు నిక్ గానీ స్పందించలేదు.