తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఆసక్తిగా 'భామా కలాపం 2' టీజర్‌ - OTTలోకి మోస్ట్ డేంజరస్ హౌస్ వైఫ్ రాక అప్పుడే - భామకలాపం 2 టీజర్

Bhamakalapam 2 Teaser : ఓటీటీలో డైరెక్ట్​గా రిలీజై విశేష ప్రేక్షకాదరణ పొందిన సినిమాల్లో 'భామా కలాపం' ఒకటి. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా 'భామా కలాపం 2' రాబోతుంది. ఈ సందర్భంగా మూవీటీమ్​ టీజర్‌ను మంగళవారం విడుదల చేసింది . ఈ సినిమాలో ప్రియమణి ప్రధాన పాత్ర పోషించగా అభిమన్యు దర్శకత్వం వహించారు. ఆద్యంతం ఆసక్తిగా సాగిన ఈ టీజర్‌పై మీరూ ఓ లుక్కేయండి..

ఆసక్తిగా 'భామా కలాపం 2' టీజర్‌ - OTTలోకి మోస్ట్ డేంజరస్ హౌస్ వైఫ్ రాక అప్పుడే
ఆసక్తిగా 'భామా కలాపం 2' టీజర్‌ - OTTలోకి మోస్ట్ డేంజరస్ హౌస్ వైఫ్ రాక అప్పుడే

By ETV Bharat Telugu Team

Published : Jan 30, 2024, 8:52 PM IST

Updated : Jan 30, 2024, 10:25 PM IST

Bhamakalapam 2 Teaser : ఓటీటీలో డైరెక్ట్​గా రిలీజై విశేష ప్రేక్షకాదరణ పొందిన సినిమాల్లో 'భామా కలాపం' ఒకటి. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా 'భామా కలాపం 2' రాబోతుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్​ను కూడా బాగానే ఆకట్టుకుంది. ప్రియమణి, శరణ్య సస్పెన్స్ డైలాగ్స్‌తో ప్రేక్షకుల్లో భామాకలాపం 2పై మరింత ఆసక్తిని పెంచారు మేకర్స్. ఈ నేపథ్యంలో ఇప్పుడు మూవీటీమ్​ టీజర్‌ను కూడా మంగళవారం విడుదల చేసింది . ఈ సినిమాలో ప్రియమణి ప్రధాన పాత్ర పోషించగా అభిమన్యు దర్శకత్వం వహించారు. ఆద్యంతం ఆసక్తిగా సాగిన ఈ టీజర్‌పై మీరూ ఓ లుక్కేయండి..

'అను మనం వదిలి వెళ్తుంది మన పాత ఇంటినే కాదు నీ తప్పుల్ని కూడా' అనే చెప్పే డైలాగ్​తో ఈ టీజర్ ప్రారంభమైంది. ఆ తర్వాత 'అనుపమ అనే నేను పక్కన వాళ్ల విషయంలో తలదూర్చనని, నా పని నేను చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటానని మాట ఇస్తున్నాను' అంటూ ప్రియమణి చెప్పడం కానీ ఆ తర్వాత ఏదో మర్డర్​ మిస్టరీలోకి ఇరుక్కోవడం వంటి చూపించారు. కాసేపు టీజర్​ను కామెడీతో పాటు ఇంటెన్స్​ మోడ్​లో తీసుకెళ్లారు. చివరికి శర్యణ్య - ప్రియమణి ఏదో శవాన్ని పూడ్చిపెట్టడంతో ముగించారు. ఆ సమయంలో శరణ్య.. 'అక్క నీకు శవాలకు మధ్య బాగా డీప్​ కనెక్షన్​ ఉందనుకుంటా' అంటూ చెప్పడం ఆసక్తికరంగా ఉంది. మొత్తంగా ఈ సినిమా కూడా ఓ మర్డర్​ మిస్టరీ థ్రిల్లర్​గా రూపొందిందని అర్థమైంది.

Bhamakalapam 2 Release Date :టీజర్​తో పాటు ప్రీమియర్స్​ స్ట్రీమింగ్ డేట్​ను అనౌన్స్​ చేశారు మేకర్స్​. ఫిబ్రవరి 16 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని బాపినీడు, సుధీర్‌ ఈదర సంయుక్తంగా నిర్మించారు. సీరత్‌ కపూర్‌, రఘు ముఖర్జీ, బ్రహ్మాజీ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఇకపోతే ఈ మధ్య కాలంలో ప్రియమణి ఎక్కువగా ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటిస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్ ఫ్రాంచైజీ, సర్వం శక్తిమయం వంటి సిరీస్​లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్​గా జవాన్‌లోనూ ఓ కీలక పాత్ర పోషించి ఆకట్టుకుంది.

రాజమౌళి - మహేశ్ సినిమాలో నాగార్జున?

'గుంటూరు కారం' ఎఫెక్ట్​ - త్రివిక్రమ్​కు ఆ మాట ఇచ్చిన మహేశ్​!

Last Updated : Jan 30, 2024, 10:25 PM IST

ABOUT THE AUTHOR

...view details