Prasanth Varma Hanuman OTT : ఎలాంటి అంచనాలు లేకుండా ఈ సంక్రాంతి బరిలో దిగి అంచనాలను తారుమారు చేసిన చిత్రం హనుమాన్. కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో థియేటర్లలో చూసిన వారితో పాటు మిగతా వారు కూడా ఎప్పుడెప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వస్తుందా? రెండో సారి ఎప్పుడు చూద్దామా అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఇప్పుడా వారి ఎదురుచూపులకు తెరదించుతూ ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైందని తెలిసింది.
వివరాల్లోకి వెళితే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా 'హనుమాన్' రూపొందింది. దాదాపు రూ.30కోట్లలోపే బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు రూ.300 కోట్ల వరకు సంచలన వసూళ్లు చేసింది. చిన్న పెద్దా తేడా అని లేకుండా ప్రతిఒక్కరూ థియేటర్లకు వెళ్లి ఈ సినిమా కోసం క్యూ కట్టారు. ఎందుకంటే ఈ చిత్రాన్ని ఎంతో నేచురల్‌గా బాగా తెరకెక్కించారు. మ్యూజిక్ కూడా అద్భుతంగా అందించారు. ఇక క్లైమాక్స్‌లో చివరి పది నిమిషాలు అయితే ప్రతిఒక్కరికీ గూస్ బంప్స్ వచ్చేలా సన్నివేశాల్ని తీశారు. దీంతో ప్రతిఒక్కరూ ఈ చిత్రానికి ఫిదా అయిపోయారు.