Prasanth Varma Hanuman Movie :తేజా సజ్జా లీడ్ రోల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ'హను-మాన్'. పాన్ ఇండియా లెవెల్లో రూపొందిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ అందుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తక్కువ బడ్జెట్‌తో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ప్రస్తుతం ఆ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఫుల్ స్వింగ్‌లో సక్సెస్ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటున్నారు. అయితే ఇందులో కీలక పాత్రైన విభీషణుడి రోల్ కోసం సముద్రఖనికి బదులుగా తొలుత ఓ స్టార్ హీరోను అనుకున్నారట. ఇంతకీ ఆయన ఎవరో కాదు విలక్షణ నటుడు రిషబ్ శెట్టి. ఈ విషయాన్ని తాజాగా ప్రశాంత్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
"ఈ సినిమాలో సముద్రఖని పోషించిన విభీషణుడి రోల్ ఎంతో కీలకం. దీని కోసం మొదట కన్నడ నటుడు రిషబ్ శెట్టిని ఎంచుకోవాలని నేను అనుకున్నాను. కానీ ఆ సమయంలో ఆయన 'కాంతార'తో బిజీగా ఉన్నారు. దీంతో ఆయన భవిష్యత్తులో తప్పకుండా నా సినిమాటిక్ యూనివర్స్‌లో నటిస్తానని చెప్పారు. బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ నితీశ్ తివారీ రామాయణాన్ని తెరకెక్కించకపోతే నేను దాన్ని చేస్తాను" అని ప్రశాంత్ అన్నారు.