తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

యంగ్ డైరెక్టర్లతో అప్​కమింగ్ మూవీస్ - PVCU, LCUలో ప్రభాస్! - PRABHAS UPCOMING MOVIES

యంగ్ డైరెక్టర్లతో అప్​కమింగ్ చిత్రాలు - ఆ స్టార్ డైరెక్టర్ల సినిమాటిక్ యూనివర్స్​లో ప్రభాస్!

prabhas-upcoming-movies-with-prasanth-varma-and-lokesh-kanagaraj
Prabhas Upcoming Movies (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 3, 2024, 5:26 PM IST

Prabhas Upcoming Movies : 'కల్కి 2898 AD' తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ ఫుల్​గా బిజీ అయిపోయారు. 'రాజాసాబ్'​తో పాటు 'సలార్ 2'ని లైనప్​లో పెట్టిన ఆయన, వీటితో పాటు మరికొన్ని బడా ప్రాజెక్టుల్లో నటించే పనిలో ఉన్నారట. అయితే ఈ లిస్ట్​లోకి ఇప్పుడు ఓ రెండు సాలిడ్ మూవీస్​ రానున్నట్లు సినీ వర్గాల్లో పెద్ద చర్చలు జరుగుతోంగి. రానున్న ఏడాది కల్లా లోకేశ్ కనగరాజ్, ప్రశాంత్ వర్మ లాంటి యంగ్ అండ్ టాప్ డైరెక్టర్లతో సినిమాలు చేసేందుకు ప్రభాస్ ఆలోచిస్తున్నారట. ఒకవేళ ప్రభాస్ ఈ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఇక లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU), ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లలో ఆయన అడుగుపెట్టేసినట్లే అని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్​ సూపర్​స్టార్ రజనీకాంత్​తో 'కూలీ' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇది పూర్తి అయిన వెంటనే కార్తీతో 'ఖైదీ 2' మొదలుపెడతారట. దాంతోపాటు అసలు LCU: చాప్టర్ 0 అనే షార్ట్ ఫిల్మ్‌ను కూడా చిత్రీకరించే పనిలో ఉన్నారట ఆయన. అందులో అసలు ఆ యూనివర్స్ ఎలా మొదలైందనే మూల కథను చిత్రీకరించబోతున్నారని సమాచారం.

ఇక ప్రశాంత్ వర్మ విషయానికొస్తే, హిందూ పురాణాల ఆధారంగా సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్‌కు 'హనుమాన్' అనే సినిమాతో శ్రీకారం చుట్టారు. తేజా సజ్జాతో రూపొందించిన ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని, దాని టైటిల్‌ను 'జై హనుమాన్' అని కూడా అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ నుంచి రిషబ్ శెట్టి హనుమాన్ పాత్రలో కనిపిస్తూ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయింది. వీటితో పాటుగా 'అధిరా', 'మహా కాళి' అనే సినిమాలు కూడా PVCU నుంచి రానున్నాయి. ఈ రెండు సినిమాటిక్ యూనివర్స్‌లలోనూ భారీ చిత్రాలనే రూపొందిస్తుండగా, ప్రభాస్‌తో ఎలాంటి సినిమా వస్తుందనేది వేచి చూడాలి మరి.

మరోవైపు ప్రభాస్ ఈ చిత్రాల్లోనే కాకుండా 'సీతా రామం' మూవీ డైరక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో నటిస్తున్నారు. దాంతో పాటుగా సందీప్ వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' చిత్రంలోనూ నటించనున్నారు. 'కల్కి' సీక్వెల్​లోనూ ప్రభాస్ కీ రోల్ ప్లే చేయనున్నారు.

'స్పిరిట్' సాలిడ్ అప్డేట్​- మూవీ పనులు షురూ

'అది తెలిసి ఆశ్చర్యపోయా - వినగానే బ్లడ్​ బాయిల్ అయిపోతది!' : ప్రభాస్‌

ABOUT THE AUTHOR

...view details