తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ట్విట్టర్​లోనూ 'ప్రభాస్' మేనియా- ఎంతైనా డార్లింగ్ క్రేజ్ వేరబ్బా - Top Hashtags Prabhas indiatwitter

Prabhas Top Hashtags: పాన్​ఇండియా స్టార్ ప్రభాస్ ట్విట్టర్​లోనూ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ట్విట్టర్​లో ఓ రికార్డు సొంతం చేసుకున్నారు.

Top Hashtags Prabhas
Top Hashtags Prabhas

By ETV Bharat Telugu Team

Published : Mar 13, 2024, 8:15 PM IST

Updated : Mar 13, 2024, 9:07 PM IST

Prabhas Top Hashtags:పాన్ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్​లో రికార్డులు, ఘనతలకు ఎలాంటి కొదవలేదు. టాలీవుడ్​ హీరో నుంచి గ్లోబల్ స్టార్​గా ఎదిగిన ఆయన ప్రస్తుతం పాన్​వరల్డ్​ సినిమాలు చేస్తున్నారు. కెరీర్​లో బాక్సాఫీస్​ వద్ద వరుసగా ఐదుసార్లు రూ. 300+ కోట్ల వసూళ్లు సాధించి చరిత్ర సృష్టించారు. ఇక తాజాగా ఆయన మరో అరుదైన ఘనత దక్కించుకున్నారు. ట్విట్టర్​లో హాష్​ట్యాగ్స్ ఆఫ్ ఇండియా టాప్-10 (Top 10 Most Used Hashtags)లిస్ట్​లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ సినీ హీరోగా నిలిచారు.

అయితే ఎంటర్​టైన్​మెంట్ విభాగంలో ట్విట్టర్​లో ఎక్కువగా యూజ్ చేసిన హాష్​ట్యాగ్ లిస్ట్​ను ట్విట్టర్​ఇండియా (@twitterindia) రిలీజ్ చేసింది. ఈ లిస్ట్​లో స్థానం దక్కించుకున్న ఏకైక హీరోగా ప్రభాస్ నిలిచారు. ఈ లిస్ట్​లో ప్రభాస్​కు ఏడో ప్లేస్​ దక్కింది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్​ 'ప్రభాస్ క్రేజ్ అట్లుంటది' అంటూ కామెంట్స్​ చేస్తున్నారు. ఇక న్యూ ప్రొఫైల్​పిక్ (#newprofilepic), క్రిప్టో (#crypto) ఈ జాబితాలో టాప్ రెండు స్థానాల్లో ఉన్నాయి.

ప్రభాస్- నాగ్​ అశ్విన్ కల్కి సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది. ప్రస్తుతం కల్కి టీమ్ ఇటలీలో చివరి దశ షూటింగ్​ పనులు జరుపుకుంటుంది. ఈ క్రమంలో హీరో ప్రభాస్, నటి దిశా పటానీ తదితరులు ఇటలీ వెళ్లారు. ఇక ఈ సినిమా కథ మహాభారతం కాలం నుంచి మొదలై, 2898తో పూర్తవుతుందని డైరెక్టర్ అశ్విన్ రీసెంట్​గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ మూవీలో దాదాపు 6వేల సంవత్సరాల మధ్య జరిగే కథను స్క్రీన్​పై చూపించనున్నట్లు అశ్విన్ చెప్పారు.

ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్​గా ఈ సినిమా థీమ్​ మ్యూజిక్​ను సంతోష్ రిలీల్ చేశారు. ఓ మ్యూజిక్ కాన్సర్ట్​లో ధీమ్ ప్లే చేసి సినిమాపై అంచనాలు పెంచారు. ఇక వైజయంతి మూవీస్ బ్యానర్​పై అశ్వనీదత్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా 2024మే 9న వరల్డ్​వైడ్​గా గ్రాండ్​గా రిలీజ్ కాన్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు.

ఇటలీ షూట్​లో స్టైలిష్​ ప్రభాస్ - ఆ జాకెట్ ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!

కాశీ పురవీధుల్లో 'భైరవ' - సాలిడ్​ పోస్టర్​తో 'కల్కి 2898 ఏడీ' మేకర్స్ సర్​ప్రైజ్​

Last Updated : Mar 13, 2024, 9:07 PM IST

ABOUT THE AUTHOR

...view details