తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మరో సినిమాకు ప్రభాస్ ఓకే- అనౌన్స్​మెంట్ ఎప్పుడంటే! - PRABHAS NEW FILM

మరో సినిమాకు ప్రభాస్ పచ్చజెండా- ప్రకటించేది అప్పుడే

Prabhas New Film
Prabhas New Film (Source : ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 17 hours ago

Prabhas New Film :టాలీవుడ్​లో అత్యంత బిజీగా ఉన్న ఉన్న హీరో రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన చేతిలో ప్రస్తుతం ఐదు సినిమాలు ఉన్నాయి. దీంతో ప్రభాస్ వరుసగా ఈ సినిమాల షూటింగుల్లో పాల్గొంటూ బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల టాక్.

అయితే ఓ దర్శకుడు చెప్పిన కథ నచ్చి ప్రభాస్ ఓకే చెప్పేశారని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ప్రొడక్షన్ బ్యానర్​ కూడా ఓకే అయ్యిందట. ఈ ప్రాజెక్ట్​ను సంక్రాంతి సందర్భంగా జనవరి 14న అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈసారి ఏ డైరెక్టర్​తో ప్రభాస్ పనిచేయనున్నారు? కథ ఎలా ఉండనుంది? అని అప్పుడే ఓ అంచనాకు వచ్చేస్తున్నారు.

షూటింగ్​లో గాయం!
అయితే ఇటీవల ఓ సినిమా షూటింగ్​లో పాల్గొన్న ప్రభాస్ స్వల్పంగా గాయపడ్డారు. వైద్యుల సూచన మేరకు ఆయన ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వరలోనే మళ్లీ సెట్స్​ పైకి వెళ్లనున్నట్లు తెలిసింది.

ముందుగా అదే
ఐదు సినిమాలు లైన్​లో పెట్టిన ప్రభాస్ త్వరత్వరగా ఒక్కో ప్రాజెక్ట్​ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ముందుగా 'రాజాసాబ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కామెడీ, హర్రర్ జానర్​లో డైరెక్టర్ మారుతి ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధికుమార్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు సంజయ్‌ దత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. 2025 మే 16న ఈ సినిమా రిలీజ్ కానుంది.

మూడేళ్లదాకా బిజీనే
రాజాసాబ్ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో 'ఫౌజీ' సినిమా తెరకెక్కుతోంది. దీంతోపాటు ప్రశాంత్ నీల్ 'శౌర్యంగ పర్వం' (సలార్ 2), సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్', నాగ్ అశ్విన్​తో 'కల్కి 2' సినిమాలు వరుసగా పూర్తి చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్​లన్నీ పూర్తి అవ్వలంటే కనీసం మూడేళ్లు పట్టే అవకాశం ఉంది. ఈ లెక్కన రానున్న మూడు, నాలుగేళ్లలో ప్రభాస్ సినిమాలు వరుసగా వచ్చే ఛాన్స్ ఉంది.

ప్రభాస్​పై కిచ్చా సుదీప్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్- డార్లింగ్ అలా ఉంటారట!

షూటింగ్​లో ప్రభాస్​కు గాయం- ఆ సినిమా ప్రమోషన్స్​కు వెళ్లడం కష్టమే!

ABOUT THE AUTHOR

...view details