Prabhas Rajasaab :పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తూ ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే మారుతీ డైరక్షన్లో తెరకెక్కుతున్న 'ద రాజా సాబ్' సినిమా కూడా చేస్తున్నారు. హర్రర్ - కామెడీగా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.
అయితే 'ద రాజా సాబ్' సినిమా లేటెస్ట్ అప్‌డేట్ విషయానికొస్తే 'ఇస్మార్ట్ శంకర్' బ్యూటీ నిధి అగర్వాల్ కూడా ఇందులో ఓ కీలక పాత్రలో నటించనుందని చాలా రోజులుగా ప్రచారం సాగుతోంది. తాజాగా ఆమె హైదరాబాద్‌లో వేసిన ఈ మూవీ సెట్‌లో కనిపించారట. సినిమా షూటింగ్ కోసమే ఆమె అక్కడకు వచ్చారనీ, కొన్ని రోజుల పాటు తాజా షెడ్యూల్లో ప్రభాస్‌తో కలిసి నటించనున్నారనీ వార్తలు ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి.
ఇకపోతే ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌తో పాటుగా మాళవిక మోహన్, రిద్ది కుమార్ కూడా ఫిమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం 2025 వరకు ఈ చిత్రం థియేటర్లలోకి రాదని తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రభాస్ లుంగీ పోస్టర్ ఫ్యాన్స్‌ను బాగానే ఆకట్టుకుంది.
కాగా, నిధి అగర్వాల్ తెలుగులో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ప్రేక్షకులను బాగానే మెప్పించినప్పటికీ ఆ తర్వాత టాలీవుడ్లో పెద్దగా కనిపించలేదు. నిధి నటించిన హీరో, మజ్ను, సవ్యసాచి సినిమాలు అంతగా కమర్షియల్ సక్సెస్ సాధించకపోవడం కారణం అయి ఉండచ్చు. అయితే బాలీవుడ్లో "మున్నా మైఖేల్" సినిమాలో టైగర్ ష్రాఫ్‌తో కలిసి నటించే అవకాశం దక్కించుకుంది. ఇక తమిళంలో ప్రముఖ నటుడు శింబుతో 'ఈశ్వరుడు' సినిమాలో నటించింది. ఈ క్రమంలోనే నిధి శింబుకి మధ్యలో ఎఫైర్ ఉందంటూ అప్పట్లో రూమర్లు కూడా బాగానే వినిపించాయి. పెళ్లి కూడా అయిందని చెప్పుకొచ్చారు. తర్వాత దీన్ని శింబు ఫ్యామిలీ ఖండించింది.
'విశ్వంభర' కోసం డేరింగ్ స్టంట్!- చిరు డెడికేషన్‌కు హ్యాట్సాఫ్! - Vishwambhara Chiranjeevi
కాశీ నమో ఘాట్‌లో రణ్వీర్, కృతి ర్యాంప్ వాక్- ట్రెడిషనల్ లుక్‌లో అదరహో! - Ranveer Singh Kriti Sanon