Prabhas Raja Saab Update:రెబల్‌స్టార్ ప్రభాస్- మారుతి కాంబోలో రాజాసాబ్ తెరకెక్కనుంది. ఈ సినిమా నుంచి ఓ పోస్టర్ తప్ప మూవీ మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అయితే డైరెక్టర్ మారుతి సోమవారం (జనవరి 29) 'ట్రూ లవర్ (True Lover) టీజర్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో మారుతిని 'రాజాసాబ్' అప్డేట్స్, రిలీడ్ డేట్ గురించి మీడియా అడగ్గా ఆయన ఆసక్తికరంగా జవాబిచ్చారు.
'మన చేతుల్లో ఏం లేదు. అది (రాజాసాబ్) వచ్చినప్పుడే వస్తాది. కచ్చితంగా అందరికీ నచ్చే తేదీనే రాజాసాబ్ వస్తుంది. ఆడియెన్స్ ఏ డేట్లో చూడాలనుకుంటే ఆ తేదీనే వస్తుంది' అని అన్నారు. ఇక రాజాసాబ్ నుంచి ప్రొడక్షన్ హౌజ్ నుంచి, మీ నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవు? అన్న మరో ప్రశ్నకు మారుతి ఇలా అన్నారు.' ప్రభాస్ ప్రస్తుతం కల్కీ చేస్తున్నారు. ముందు అదే వస్తుంది. దాని గురించే అందరూ మాట్లాడుకోవాలి. అది అందరూ చూడాలి. ఆ సినిమా తర్వాత మాదే. అప్పుడు చూద్దాం' అని మారుతి రిప్లై ఇచ్చారు.
ప్రారంభమైన షూటింగ్!: అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైట్లు కథనాలు వస్తున్నాయి. కానీ, మూవీటీమ్ ఈ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచిందట. రాజాసాబ్‌లో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారని తెలుస్తోంది. ఇక మ్యూజిక్ సంచలనం తమన్ సంగీతం అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు సహా హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ఇండియా లెవెల్లో ఈ సినిమా రూపొందుతోంది.