Prabhas Kalki 2898 AD Movie :నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన భారీ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ మూవీ 'కల్కి 2898 AD'. తొలి రోజు నుంచి భారీ స్థాయిలో కలెక్షన్లు వసూలు చేస్తూ సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. కురుక్షేత్ర సమయం మొదలుకొని 6000 సంవత్సరాల తర్వాత ప్రపంచం ఎలా ఉండబోతుందో కళ్ల ముందు చూపించారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ పాత్రలు, వారి నటన ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. వీరితో పాటు దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృనాల్ ఠాకూర్, ఎస్ఎస్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ కూడా గెస్ట్ రోల్స్‌లో తళుక్కుమన్నారు. అయితే ఇంతమంది భారీ తారాగణంలో రూపొందిన ఈ సినిమాలో ఒకే ఒక్క నటుడు మాత్రం రెమ్యునరేషన్ లేకుండా నటించారని తెలిసింది.
ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా? ఆయన మరెవరో కాదు మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ప్రముఖ మీడియాలో ప్రచురించిన కథనం ప్రకారం పాండవులలో మూడో సోదరుడైన అర్జునుడి పాత్రలో విజయ్ నటించారు. సినిమాలో అశ్వత్థామ(అమితాబ్)కు, బైరవ (ప్రభాస్)కు మధ్య కనెక్షన్‌ను వివరించేందుకు అర్జునుడి పాత్రను చూపించారు. అలా అర్జునుడి పాత్రలో కొద్ది నిమిషాల పాటు విజయ్ తెరపై కనిపిస్తారు. ఈ పాత్రలో ఆయన నటనకు, డైలాగ్ డెలివరీకి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ పీరియాడిక్ డ్రామాలో విజయ్ దేవరకొండను చూడటాన్ని చాలా సంతోషంగా ఫీలవుతున్నారు ఆయన ఫ్యాన్స్.
కాగా, నాగ్ అశ్విన్ డైరక్టర్‌గా తీసిన తొలి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యంలో హీరోగా నటించారు విజయ్. అనంతరం తన రెండో సినిమా మహానటిలోనూ విజయ్‌కు అవకాశమిచ్చారు నాగ్. ఇకపోతే దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన కల్కి సినిమా నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.550కోట్లకుపైగా వసూళ్లను అందుకుంది.