Prabhas Kalki 2898 AD Release Date :వాయిదా పడుతూ వస్తున్న ప్రభాస్ 'కల్కి' ఎట్టకేలకు రిలీజ్ డేట్‌ను కన్ఫామ్ చేసుకుంది. ఇండియా మొత్తం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే వరుసగా వస్తున్న మూవీ అప్‌డేట్‌లు సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేశాయి. ఈ క్రమంలోనే మూవీ టీమ్ శనివారం లేటెస్ట్ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. ముందుగా ప్రచారం సాగిన ప్రకారమే ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న ఈ సినిమా థియేటర్లలో రానున్నట్లు మూవీటీమ్ అఫీషియల్‌గా ప్రకటించింది. అలానే సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్టర్‌ను షేర్ చేసింది. ప్రభాస్, దీపికా, అమితాబ్‌తో ఉన్న పోస్టర్ విడుదల చేయగా అది ఫ్యాన్స్‌కు తెగ నచ్చేసింది.
కల్కిలో టాప్ యాక్టర్లు -సైన్స్ ఫిక్షన్ స్టోరీతో, పురాణాల ఆధారంగా తెరకెక్కుతున్న కల్కిలో ప్రభాస్ భైరవగా కనిపించనున్నారు. బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా నటించనున్నారు. ఇటీవల అశ్వత్థామగా ఉన్న అమితాబ్ గ్లింప్స్‌ను మూవీ టీమ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అమితాబ్ లుక్ సినిమాపై అంచనాలు పెంచేసింది.
ఇందులో మరో స్టార్ హీరో కమల్‌హాసన్ విలన్‌గా యాక్ట్ చేస్తున్నారు. ప్రభాస్‌కు జోడీగా దీపిక పదుకొణె నటిస్తుండగా పశుపతి, దిశాపటానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.