తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'దాని కోసం చాలా కాలం ఎదురుచూశా' - అమితాబ్​పై కమల్​ ఇంట్రెస్టింగ్​​ కామెంట్స్ - Kalki 2898 AD Pre Release Event

Kalki 2898 AD Pre Release Event : కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్​లో ఈ సినిమా గురించి తమ అనుభవాల్ని పంచుకున్నారు అమితాబ్ బచ్చన్​, కమల్ హాసన్​. ఏం అన్నారంటే?

source ANI and ETV Bharat
Amitab Prabhas Kamal (source ANI and ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 20, 2024, 6:45 AM IST

Kalki 2898 AD Pre Release Event : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎ.డి. మరో వారం రోజుల్లో(జులై 27) థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీపికా పదుకొణె హీరోయిన్​. కమల్‌ హాసన్‌, అమితాబ్ బచ్చన్​ కీలక పాత్రల్లో నటించారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్​పై సి.అశ్వనీదత్‌ నిర్మించారు. ఈ సందర్భంగా ముంబయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్​ను మూవీటీమ్​ గ్రాండ్​గా నిర్వహించింది. ఈ వేడుకకు విలక్షణ హీరో రానా దగ్గుబాటి హోస్ట్​గా వ్యవహరించారు. ఆయన అడిగిన పలు ప్రశ్నలకు మూవీటీమ్​ అంతా​ సమాధానలు ఇచ్చింది.

Kalki 2898 AD Pre Release Event Kamalhassan : అలానే వేడుకలో మొదటి టికెట్‌ను అమితాబ్‌ బచ్చన్‌ కొని కమల్‌ హాసన్‌కు ఇచ్చారు. ఈ సందర్భంగా కమల్‌ హాసన్‌ తన మనసులోని మాటను బయటపెట్టారు. "ఇలా మొదటి ఆట టికెట్‌ను దక్కించుకునే అవకాశం షోలే సినిమాకు వచ్చి ఉంటే బాగుండేది. కొన్ని వారాల పాటు ఆ మూవీ టికెట్‌ కోసం ఎదురు చూశాను. అప్పట్లో ఆ సినిమాను చూసిన ప్రేక్షకుల కన్నా ఎక్కువగా ఇప్పుడు కల్కి 2898 ఎ.డిని చూస్తారని ఆశిస్తున్నాను. నా గురువు, మెంటార్​ బాలచందర్‌లా అసాధారణమైన వ్యక్తులు చాలా సాధారణంగా కనిపిస్తారు. అందుకే అలాంటి వారితో మాట్లాడేవరకూ వారి గురించి ఓ అభిప్రాయానికి రాను. సాధారణమైన వ్యక్తిలా వచ్చి నాగ్‌ అశ్విన్‌ కథ చెబుతున్నప్పుడు అతడిలో నేర్పుని చూసి అద్భుతం అనిపించింది. సినిమాను అంతే నేర్పుగా తెరపైకి తీసుకొచ్చాడు" అని కమల్​ అన్నారు.

Kalki 2898 AD Pre Release Event Amitab Bachan : ఇక అమితాబ్‌ బచ్చన్‌ కూడా సినిమా గురించి, నాగ్​ అశ్విన్ గురించి మాట్లాడారు. "ఈ చిత్రం ఓ కొత్త ప్రపంచం. నాకు ఎప్పటికీ మరిచిపోలేని అనుభవాన్ని ఇచ్చింది. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఈ కథ చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. ఏం తాగితే ఇలాంటి ఆలోచనలు వస్తాయో అనిపించింది. భవిష్యత్తుతో ముడిపడిన ఓ అద్భుతమైన సినిమాను తెరకెక్కించాడు. ఇందులో నేను భాగం అవ్వడం నాకెంతో గర్వకారణం. నిర్మాత అశ్వనీ దత్‌ వంటి నిర్మాతను కూడా ఇది వరకు నేనెప్పుడూ చూడలేదు, కలవలేదు. ఆయన వ్యక్తిత్వం ఎంతో గొప్పది" అని బిగ్ బీ అన్నారు.

రావణ బ్రహ్మగా ప్రభాస్! - ఏ సినిమాలో అంటే? - Prabhas as RavanaBramha

'కల్కి' ఫస్ట్ రివ్యూ - టాక్​ ఎలా ఉందంటే? - Kalki 2898AD First Review

ABOUT THE AUTHOR

...view details