Prabhas Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడీపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రంపై ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ జోనాథన్ కామెంట్స్ చేశారు. అలాగే ఆయన ఇండియన్ సినిమాల గురించి కూడా మాట్లాడారు.
"ఇండియన్ సినిమాల్లో లొకేషన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. వారి స్టంట్స్ కూడా ఆకట్టుకునేలా ఉంటాయి. నాకు సైన్స్ ఫిక్షన్ మూవీస్ తెరకెక్కించడం అంటే చాలా ఇష్టం. అవి ప్రేక్షకుల్లో మంచి ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేస్తాయి. కల్కి 2898 ఏడీ మేకర్స్ ప్రస్తుతం సలహా తీసుకునే స్థాయిలో లేరనే చెప్పాలి. వాళ్లు ఏం చేస్తున్నారో పక్కా క్లారిటీతో ఉన్నారు. అన్నీ ప్రాక్టికల్‌గా ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం ఇండియన్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ హాలీవుడ్ వారి కన్నా కూడా గొప్పగా పని చేస్తున్నారని నా అభిప్రాయం. ప్రతీ సీన్‌ను క్లియర్‌గా చూపిస్తున్నారు" అంటూ జోనాథన్ ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ ప్రభాస్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. వారు ఈ కామెంట్స్‌ను సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు.