Prabhas Hanu Raghavapudi Movie :సలార్, కల్కి 2898 ఏడీ సినిమాలతో వరుసగా భారీ బ్లాక్ బస్టర్లను అందుకున్న పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కాస్త విరామంలో ఉన్నారు. అయితే ఇప్పుడాయన మళ్లీ బిజీ కానున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన లైనప్‌లో హను రాఘవపూడి సినిమా కూడా ఉంది. త్వరలోనే ఈ కొత్త సినిమా పట్టాలెక్కేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నెల 17న ప్రారంభం కాబోతుందట. షూటింగ్ కూడా ఈ నెలలోనే మొదలు పెడతారని సమాచారం అందింది.
మరోవైపు ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమా కొత్త షెడ్యూల్ కూడా ఈ నెలలోనే ప్రారంభం కానుందని తెలిసింది. అంటే ఈ రెండు సినిమాలు కూడా ఏక కాలంలోనే సెట్స్‌పై ఉంటాయి కాబట్టి ప్రభాస్ వరుస చిత్రీకరణలతో బిజీ కానున్నారు.
కాగా, హను రాఘవపూడి డైరెక్షన్లో రూపొందనున్న సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తోంది. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారట. ఫౌజీ అనే పేరును ఈ సినిమాకు టైటిల్‌గా పెడతారని ప్రచారంలో ఉంది. ప్రభాస్‌కు జోడీగా మృణాల్ ఠాకూర్ నటించే అవకాశాలున్నట్టు టాక్ నడుస్తోంది. ఇక రాజాసాబ్‌ను దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నిర్మిస్తోంది. ఇందులో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తుండగా, ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు.