Prabhas As Ravana Brahma:మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా 'కన్నప్ప' తెరకెక్కుతోంది. ఇందులో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజైన టీజర్లోనూ ఆయన కళ్ల వరకు చూపించారు. అయితే డార్లింగ్ పాత్ర ఏమనేది క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఆయన పాత్ర గురించి పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా మరోసారి ఆయన పాత్ర గురించి కొత్త ప్రచారం మొదలైంది.
Prabhas Role In Kannappa Movie: 'కన్నప్ప'లో ప్రభాస్ కొన్ని నిమిషాలు మాత్రమే కనిపిస్తారని మొదటి నుంచి ప్రచారం సాగుతోంది. మొదట ఆయన శివుడి పాత్రలో కనిపిస్తారని అంతా అన్నారు. కానీ ఆ రోల్‌ను అక్షయ్ కుమార్ చేశారు. టీజర్లోనూ ఆయన్ను శివుడిగా చూపించారు. అలానే ప్రభాస్‌ను కూడా ఓ రెండు సెకన్ల పాటు చూపించారు. అది కూడా కేవలం కళ్లు మాత్రమే చూపించారు. నుదుట అడ్డంగా నామాలు, నిలువున ఎర్రటి నామంతో కనిపించారు ప్రభాస్. పూర్తి ఫేస్‌ను రివీల్ చేయలేదు. అయితే ఆయన నందీశ్వరుడిగా కనిపిస్తారని అంతా అన్నారు.
అయితే దీనిపై మంచు విష్ణు అండ్ టీమ్ స్పందించలేదు. 'మేం ఒక పాత్ర అనుకుని దాన్ని ప్రభాస్ చెయ్యాలని అడగడానికి వెళ్లాం. కానీ ఆయన మరొక పాత్ర చేస్తానని అన్నారు' అని మాత్రమే విష్ణు పేర్కొన్నారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం ప్రభాస్ రావణ బ్రహ్మగా కనిపించనున్నారట. ఆ మహా శివునికి కన్నప్ప ఎంతటి పరమ భక్తుడో రావణుడు కూడా అపర భక్తుడన్న సంగతి తెలిసిందే. ఇప్పుడా రావణ పాత్రనే ప్రభాస్ చేశారట. టీజర్లో పూర్తి ఫేస్‌ను రివీల్ చేస్తే రావణ బ్రహ్మ అనేది అర్థమవుతుందని చూపించలేదట. మరి ఇందులో నిజమెంతో పక్కాగా తెలీదు. చూడాలి మరి ప్రభాస్ క్యారెక్టర్‌ను విష్ణు ఎప్పుడు రివీల్ చేస్తారో? లేదంటే డైరెక్ట్‌గా థియేటర్లలో చూసి తెలుసుకోవాలో.