తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

పవర్ స్టార్ ఫ్యాన్స్​కు నిరాశ- 'OG' గ్లింప్స్​ పోస్ట్​పోన్! - Pawan Kalyan OG - PAWAN KALYAN OG

Pawan Kalyan OG Movie: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా 'OG' నుంచి రావాల్సిన గ్లింప్స్ పోస్ట్​పోన్ అయినట్లు మేకర్స్ తెలిపారు.

OG Glimps
OG Glimps (Source: ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 1, 2024, 9:16 PM IST

Pawan Kalyan OG Movie:పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. అవన్నీ కూడా భారీ బడ్జెట్ చిత్రాలే. అందులో ఒకటి సుజిత్ డైరెక్షన్‌లో రెడీ అవుతున్న 'OG'. భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై పవర్ స్టార్ ఫ్యాన్స్​కు హై లెవెల్ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా నుంచి గతేడాది ఓ పోస్టర్, గ్లింప్స్ మినహా ఎలాంటి అప్డేట్ లేదు.

ఇక సెప్టెంబర్ 2న ఆయన పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమా నుంచి సాలిడ్ అప్డేట్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సోమవారం మధ్యాహ్నం సెకండ్ గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ పవర్​ఫుల్ పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో ఫ్యాన్స్​లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

తాజాగా మేకర్స్​ మరో ప్రకటనతో ఫ్యాన్స్​ కాస్త నిరాశ చెందారు. 'పవర్ ప్యాక్డ్​ ఫైర్' వేడుకలు మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్నాయి. OG అనేది సినిమా మాత్రమే కాదు. ఇది అందరికీ ఒక వేడుక లాంటిది. ఈ ప్రత్యేకమైన రోజును మరింత గ్రాండ్​గా సెలబ్రేట్ చేయడానికి చాలా ప్రయత్నించాం. కానీ, భారీ వర్షాల కారణంగా OG సెలబ్రేషన్స్​ మరొక రోజుకు పోస్ట్ పోన్ చేస్తున్నాం' అని రాసుకొచ్చారు. అయితే ఫ్యాన్స్ కోసం రేపు ఓ స్పెషల్ పోస్టర్​ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అలాగే ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ కూడా సోమవారం అనౌన్స్ చేయనున్నట్లు పేర్కొన్నారు.

కాగా, ఇప్పటికే రిలీజైన హంగ్రీ చీతా గ్లింప్స్​కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఫ్యాన్స్​ అంతా రెండో గ్లింప్స్​ కోసం వెయిట్ చేశారు. కానీ, తాజా అనౌన్స్​మెంట్​తో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఇక పవన్ సరసన ఈ సినిమాలో ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్​గా నటిస్తోంది. శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్, ఇమ్రాన్ హష్మి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా 2025 మార్చి 27న వరల్డ్​వైడ్ గ్రాండ్​గా రిలీజ్ కానుంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్​పై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

'నాని, పవన్ కల్యాణ్ మధ్య ఉన్న పోలిక అదే!' : ప్రియాంక మోహన్‌ - Saripodhaa Sanivaaram Priyanka

PK ఫ్యాన్స్ గెట్​రెడీ- 'OG' నుంచి స్పెషల్ వీడియో- ఎప్పుడంటే? - Pawan Kalyan OG

ABOUT THE AUTHOR

...view details