Pooja Hegde New Movie : పూజా హెగ్డే ఒకప్పుడు పొడుగు కాళ్ల సుందరిగా మస్త్ క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో అంతగా వినపడట్లేదు. చాలా కాలం నుంచి ఈ ముద్దుగుమ్మ ఏ చిత్రంలోనూ నటించలేదు. అయితే ఇప్పుడీ ముద్దుగుమ్మకు ఓ స్టార్ కిడ్ సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశం వచ్చింది.
వివరాల్లోకి వెళితే కెరీర్ మొదట్లో పూజా హెగ్డే పేరు బాగా వినిపించేది. అన్నీ సినిమాల్లోనూ తనే హీరోయిన్గా కనిపించేది. ముకుందతో మొదలైన ఈ ముద్దుగుమ్మ ప్రయాణం ఆ తర్వాత ఒక లైలా కోసం, మహర్షి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రంగ స్థలం అంటూ చాలా చిత్రాల్లోనే సందడి చేసింది. ఆ తర్వాత హిందీలోనూ వరుస అవకాశాలను అందుకుని కెరీర్లో ముందుకెళ్లింది.
కానీ తెలుగులో అలా వైకుంఠపూరములో తర్వాత పూజా హెగ్డేకు గడ్డు కాలం మొదలైంది. రాధేశ్యామ్ సినిమా చేయగా అది దెబ్బకొట్టింది. దీని తర్వాత కోలీవుడ్ లో బీస్ట్ చేస్తే అది కూడా చేదు ఫలితాన్ని ఇచ్చింది. మళ్లీ ఆచార్య చేయగా బెడిసికొట్టింది. హిందీలో సర్కస్, కిసీ కి భాయ్ కిసీ కా జాన్ కూడా డిజాస్టర్‌గా నిలిచాయి. అలా అప్పటి వరకు టాప్ హీరోయిన్గా చెలామని అయిన ఈ భామ అదృష్టం ఐరెన్ లెగ్గా మారిపోయింది. ఈమె సక్సెస్ రుచి చూసి మొత్తంగా మూడు సంవత్సరాలకుపైగా అయిపోయింది.