Tollywood Actor Subbaraju Marriage :టాలీవుడ్ ప్రముఖ నటుడు సుబ్బరాజు గురించి తెలుగు సినీ ప్రియులకు తెలిసే ఉంటుంది. తెలుగులో చాలా సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఆయన ఎట్టకేలకు ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. పలు సార్లు ఇంటర్వ్యూల్లో పెళ్లి గురించి ప్రస్తావన వచ్చి నప్పుడల్లా ఆసక్తి లేదని చెబుతూ వచ్చిన సుబ్బరాజు, ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కి షాక్ ఇచ్చారు. 47 ఏళ్ల వయసులో ఒక ఇంటివాడు అయ్యారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేశారు. పెళ్లి కూతురుతో కలిసి బీచ్‌లో దిగిన ఫొటోను షేర్ చేశారు.
పెళ్లికి సంబంధించి ఎలాంటి హడావుడి, రూమర్స్‌కు తావు లేకుండా సైలెంట్‌గా పెళ్లి చేసేసుకున్నారు. దీంతో టాలీవుడ్ సినీ ప్రేక్షకులు, నెటిజన్లు షాక్ అవుతున్నారు. అలానే సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, సినీ అభిమానులు ఈ నూతన జంటకు అభినందనలు చెబుతున్నారు. అయితే సుబ్బరాజు భార్య గురించి వివరాలు ఏమీ తెలియరాలేదు. చాలా మంది మాత్రం ఆమె గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Tollywood Actor Subba raju Movies :కాగా, సుబ్బరాజు తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ చిత్రాల్లోనూ విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తక్కువ సమయంలోనే మంచి పాత్రల్లో నటించే అవకాశం రావడంతో స్టార్‌గా ఎదిగారు. భీమవరానికి చెందిన సుబ్బరాజు మొదట 'ఖడ్గం' సినిమాలో చిన్న పాత్రతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.