Pawan kalyan on Pushpa 2 : పవన్ కల్యాణ్ ఆ మధ్య చెట్ల నరికివేత, స్మగ్లింగ్ గురించి చేసిన కామెంట్స్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు హీరోలు అడవులను కాపాడే వారు. కానీ ఇప్పుడు అడవులను ధ్వంసం చేసేవాళ్లు హీరోలవుతున్నారు అంటూ ఆయన అన్నారు. దీంతో పవన్ ఇన్‌డైరెక్ట్‌గా 'పుష్ప' మూవీ థీమ్ గురించి అన్నారని ప్రచారం సాగింది. అప్పటికే మెగా ఫ్యామిలీ - అలు అర్జున్‌కు మధ్య విభేదాలు వచ్చినట్లు ప్రచారం సాగడంతో, పవన్ 'పుష్ప' గురించే అలా అన్నారని వార్తలు వచ్చాయి. ఇది పవర్ స్టార్ - అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య పెద్ద వివాదానికి కూడా దారీ తీసింది. ఇంకా ఈ ప్రచారం, వివాదం కొనసాగతూనే ఉంది.
అయితే తాజాగా ఈ విషయమై ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాత రవి శంకర్ స్పందించారు. చెట్ల నరికివేత, స్మగ్లింగ్ గురించి రీసెంట్గా పవన్ కల్యాణ్ అన్న కామెంట్స్ 'పుష్ప 2'ను ఉద్దేశించి కాదని రవి శంకర్ స్పష్టత ఇచ్చారు. పవన్ ఎప్పుడూ కావాలని అలా మాట్లాడరని క్లారిటీ ఇచ్చారు. మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటేనని ఆయన చెప్పుకొచ్చారు. పుష్ప-2 సినిమా డిసెంబరు 6న కచ్చితంగా రిలీజ్ అవుతుందని చెప్పారు.
అలానే తమ బ్యానర్‌తో తెరకెక్కుతోన్న మరో చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' గురించి కూడా అప్డేట్ ఇచ్చారు. "ఈ మధ్యే పవన్ కల్యాణ్‌ను కలిశాను. త్వరలోనే 'ఉస్తాద్ భగత్‌సింగ్' షూటింగ్ ప్రారంభిస్తాం. డిసెంబర్, జనవరి నాటికి షూ పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నాం. సెప్టెంబర్ 2 పవన్ పుట్టిన రోజు నాడు మా టీమ్ నుంచి ఓ సర్ప్రైజ్ కచ్చితంగా ఉంటుంది" అని అన్నారు.