Pawan Kalyan Pen :పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా ఏపీ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతూ సందడి చేస్తున్నారు. అయితే తాజాగా చిరంజీవి సతీమణి సురేఖ తన మరిది పవన్‌కు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ఓ ప్రముఖ కంపెనీకి చెందిన లిమిటెడ్ ఎడిషన్ పెన్ను బహుమతిగా అందించారు.
దీనికి సంబంధించిన వీడియోను మెగాస్టార్ చిరు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. "కళ్యాణ్ బాబుకు వదినమ్మ బహుమతి" అంటూ ఓ స్వీట్ క్యాఫ్షన్ను కూడా రాసుకొచ్చారు. "తెలుగు ప్రజల ఆకాంక్షల్ని నిజం చేస్తావని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ - వదిన, అన్నయ్య"
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. దీంతో ఆ పెన్ ధర తెలుసుకునేందుకు అభిమానులు నెట్టింట తెగ వెతికేశారు. తీరా ధర తెలిసి ఒక్కసారిగా షాకయ్యారు. ప్రస్తుతం ఈ పెన్ ధర దాదాపు రూ. 80 వేల నుంచి రూ.మూడు లక్షల లోపల అంటూ ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్ చేస్తున్నారు. దీంతో ఈ పెన్ ధర కరెక్ట్‌గా ఎంత అని తెలియనప్పటికీ చాలా ఖరీదే అని టాక్ నడుస్తోంది.