Pawan Kalyan OG:పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటారు. లేకపోతే సినిమా నుంచి టీజర్, ట్రైలర్, అప్డేట్ ఏది వచ్చినా పండగ చేసుకుంటారు. అయితే యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో పవర్ స్టార్ హీరోగా 'OG' (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి పవన్ పుట్టినరోజున ఓ క్రేజీ అప్డేట్ రానున్నట్లు తెలుస్తోంది. అదేంటంటే?
పవన్ కల్యాణ్ పుట్టిన రోజు ఆయన ఫ్యాన్స్ ఓ పండగలా జరుపుకుంటారు. కేకులు కట్ చేయడం, రక్తదానం, అన్నదానం చేస్తుంటారు. అలాగే నిరుపేదలకు వస్త్రదానం కూడా చేస్తారు. అయితే ఆయన పుట్టిన రోజున సినిమా నుంచి ఏదైనా అప్డేట్ ను కోరుకుంటారు. గతేడాది పవన్ పుట్టినరోజు( సెప్టెంబరు 2)న 'OG' నుంచి 'హంగ్రీ చీతా' అంటూ ఓ గ్లింప్స్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ గ్లింప్స్ ఫ్యాన్స్‌కు పునకాలు తెప్పించింది. ఆ తర్వాత పవన్ రాజకీయాల్లో బిజీ కావడం వల్ల షూటింగ్‌కు బ్రేక్ పడి సినిమా నుంచి అప్డేట్స్ రాలేదు. అలాగే ఇంకా సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడం వల్ల వచ్చే ఏడాది ప్రారంభంలో మూవీ విడుదలయ్యే అవకాశం ఉంది.
పవర్ ప్యాక్ వీడియో
ఈ నేపథ్యంలో పవన్ బర్త్ డేకి డైరెక్టర్ సుజీత్ ఓ పవర్ ప్యాక్ వీడియోను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోను తీర్చిదిద్దే పనిలో సుజీత్ ఉన్నట్లు సమాచారం. ఈ వీడియోను పవర్ స్టార్ అభిమానులను నచ్చుతుందని, పూనకాలు తెప్పిస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఇప్పటి నుంచే కామెంట్లు చేస్తున్నారు. పవర్ స్టార్ బర్త్ స్పెషల్ అని, అది అదిరిపోతుందని కామెంట్లు పెడుతున్నారు.