Pawan Kalyan OG Movie :పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'ఓజీ'. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ, కోలీవుడ్ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్, శ్రియా రెడ్డి, సీనియర్ నటుడు వెంకట్ ఇలా పలువురు స్టార్స్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తూ సందడి చేస్తున్నారు.
అయితే ఇప్పుడు ఈ తారాగణంలోకి మరో స్టార్ హీరో వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 'ఓజీ' కోసం ఆ నటుడు గెస్ట్ రోల్లో కనిపించనున్నారట. ఆయనెవరో కాదు బీటౌన్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్. డైరెక్టర్ సుజీత్ ఈ స్టార్ హీరోను ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నారట. అయితే అమితాబ్ ఈ రోల్‌కు ఓకే చెప్పకపోతే ఆయన స్థానంలో మలయాళ స్టార్ మమ్మూట్టిని తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, మేకర్స్ ఈ చిత్రం నుంచి మరో సాలిడ్ పోస్టర్‌ను రిలీజ్ చేసే పనుల్లో ఉన్నారట. త్వరలోనే పవన్ కల్యాణ్‌కు సంబంధించిన ఆ పోస్టర్‌ను రిలీజ్ చేసేందుకు టాక్ నడుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను కూడా నేడు (జూన్ 4) చిత్ర బృందం వెల్లడించే సూచనలు కనిపిస్తున్నాయి.