ETV Bharat / offbeat

పిల్లల కోసం సూపర్ స్నాక్ రెసిపీ - టేస్టీ "ఆలూ బటర్ శాండ్​విచ్" - సింపుల్​గా చేసుకోండిలా! - POTATO BUTTER SANDWICH

యమ్మీ యమ్మీ "ఆలూ బటర్ శాండ్​విచ్" - ఇలా చేసి ఇచ్చారంటే పిల్లలు ఒక్కటీ మిగల్చరు!

Potato Sandwich Recipe in Telugu
Potato Sandwich Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 4, 2024, 10:27 PM IST

Potato Sandwich Recipe in Telugu : ఈవెనింగ్ అయ్యిందంటే చాలు.. స్కూలు నుంచి ఇంటికొచ్చే పిల్లల కోసం యమ్మీ యమ్మీ స్నాక్స్ తయారుచేయడంలో బిజీ అయిపోతారు అమ్మలు. అవసరమైతే కొందరు తమ చిన్నారులకు యూట్యూబ్‌లో చూసి రోజుకో సరికొత్త స్నాక్ రెసిపీ తయారీని నేర్చుకొని మరీ చేసి పెడుతుంటారు. అలాంటి వారికోసం ఒక అద్దిరిపోయే స్నాక్ రెసిపీ పట్టుకొచ్చాం. అదే.. "ఆలూ బటర్ శాండ్​విచ్". టేస్ట్ అద్దిరిపోతుంది! పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. పైగా ఈ శాండ్​విచ్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ! మరి, అందుకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • బంగాళదుంపలు - 2
  • బ్రెడ్ స్లైసులు - 10
  • బటర్ - తగినంత
  • సన్నని ఉల్లిపాయ తరుగు - 2 టేబుల్​స్పూన్లు
  • టమాటా తరుగు - 2 టేబుల్​స్పూన్లు
  • గ్రీన్ క్యాప్సికం తరుగు - 2 టేబుల్​స్పూన్లు
  • ఉడికించిన స్వీట్‌కార్న్ - 1 టేబుల్​స్పూన్
  • రెడ్‌చిల్లీ సాస్‌ - 1 టేబుల్‌స్పూన్‌
  • కొత్తిమీర తరుగు - చారెడు
  • ఉప్పు - రుచికి తగినంత
  • నిమ్మరసం - చెంచా
  • సన్న కారప్పూస - 2 చెంచాలు
  • టమాటా సాస్ - 2 చెంచాలు

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా బంగాళదుంపలను ఉడికించి పైపొట్టు తొలగించుకోవాలి. ఆపై వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయ, టమాటా, క్యాప్సికం తరుగుని సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి.
  • ఇప్పుడు కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలను ఒక మిక్సింగ్ బౌల్​లోకి తీసుకొని మెత్తగా మాష్ చేసుకోవాలి. అనంతరం అందులో సన్నగా తరుకున్న ఉల్లిపాయ, టమాటా, గ్రీన్ క్యాప్సికం తరుగు, ఉడికించిన స్వీట్​కార్న్, ఉప్పు, కొత్తిమీర తరుగు, రెండు చెంచాల వెన్న, రెడ్​చిల్లీ సాస్, నిమ్మరసం ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • అనంతరం బ్రెడ్ స్లైసులను ఒక్కో దాన్ని తీసుకొని నాలుగు త్రిభుజాలు వచ్చేలా ఒక మూల నుంచి మరో మూలకు క్రాస్​గా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని బ్రెడ్ స్లైసులను కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి.
  • తర్వాత ఒక స్లైస్ మీద ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమం ఒక చెంచా వేసుకొని సమాంతరంగా స్ర్పెడ్ చేసుకొని.. రెండో స్లైస్​తో కప్పేయాలి. ఈవిధంగానే మొత్తం బ్రెడ్ స్లైసులను స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • అనంతరం స్టౌపై పాన్ పెట్టుకొని బటర్ వేసుకోవాలి. అది వేడయ్యాక.. స్టఫ్ చేసి పెట్టుకున్న శాండ్​విచెస్​ను పరిచినట్లు పెట్టి వాటి మీద కూడా కొద్దిగా వెన్న వేసి వేయించాలి.
  • అవి వన్​ సైడ్ లైట్ గోల్డెన్ కలర్​లోకి మారాక మరో వైపునకు టర్న్ చేసుకొని అటువైపు కూడా అదేవిధంగా కాల్చుకోవాలి.
  • అన్నింటినీ అలాగే కాల్చుకున్నాక.. టమాటా సాస్​లో ముంచి పైన కొద్దిగా సన్న కారప్పూసను చల్లి సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. యమ్మీ యమ్మీగా "ఆలూ బటర్ శాండ్​విచ్" రెడీ!

ఇవీ చదవండి :

అద్దిరిపోయే స్ట్రీట్ ఫుడ్ "స్పైసీ ఉల్లి మిక్చర్" - ఇంట్లోనే 5 నిమిషాల్లో ప్రిపేర్ చేయండి!

కరకరలాడే "ఎగ్ కట్​లెట్స్" - నిమిషాల్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి - టేస్ట్ వేరే లెవల్​ అంతే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.