HariHara VeeraMallu Shooting Pawan Kalyan :పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతోన్న సినిమాల్లో పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ హరి హర వీరమల్లు కూడా ఒకటి. రెండు భాగాలుగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తొలి భాగం హరి హర వీరమల్లు పార్ట్ 1 : స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే మొదటి భాగానికి సంబంధించి చిత్రీ కరణ ముగింపు దశకు చేరుకుంది. కానీ వాస్తవానికి గత కొద్ది కాలంగా పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా మిగిలిన చిత్రీకరణ వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలోనే రీసెంట్‌గానే మళ్లీ షూటింగ్ ప్రారంభించుకుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రిగా తీరిక లేకుండా ఉన్న, పవన్ కల్యాణ్ ఈ సినిమా షూటింగ్‌కు కాస్త సమయాన్ని కేటాయించారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఆయన ఫైనల్ షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నారు. ఈ విషయాన్ని మూవీ టీమ్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తెలిపింది. సెట్స్‌లో పవన్ కల్యాణ్ స్క్రిప్ట్ పేపర్ చదువుతున్న ఫొటోను పంచుకుంది. 2025 మార్చి 28న సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపింది. ఆ మధ్య కూడా 'అన్‌స్టాపబుల్ ఫోర్స్, అన్‌బ్రేకబుల్ స్పిరిట్ మార్చి 28న విడుదల కానుంది' అని పేర్కొంది.