Old Songs Remixed In Telugu Films : కొన్ని సార్లు పాత పాటలు ఎంతో వినసొంపుగా అనిపిస్తుంటాయి. అయితే ఆ సాంగ్స్‌ను ఇప్పటితరం వారి కోసం కొంత మంది డైరెక్టర్లు రీమేక్ చేసి హిట్స్ కొట్టారు. అప్పటి దంచవే మేనత్త కూతురా నుంచి బంగారు కోడిపెట్ట వరకు టాలీవుడ్లో రీమేక్ అయిన పలు రీమేక్ సాంగ్స్ గురించి ఓ లుక్కేద్దామా.
దంచవే మేనత్త కూతురా
'మంగమ్మ గారి మనవడు' సినిమా కోసం 1984లో నందమూరి బాలకృష్ణ, సుహాసిని కలిసి దంచవే మేనత్త కూతురా అనే సాంగ్ చేశారు. అప్పట్లో సూపర్ హిట్ అయిన ఈ పాటను 2009లో రిలీజ్ అయిన 'రైడ్' సినిమాలో రిమేక్ చేశారు. ఆ తర్వాత తాజాగా వచ్చిన 'భగవంత్ కేసరి' సినిమాలోనూ ఈ సాంగ్‌ను రీమేక్ చేశారు.
ఆరేసుకోబోయి పారేసుకున్నాను
1977లో రిలీజ్ అయిన 'అడవి రాముడు' సినిమాలోని ఈ పాటకు సీనియర్ ఎన్టీఆర్, జయపద్ర వేసిన స్టెప్పులు ఇప్పటికీ మర్చిపోలేరు. అందుకే ఈ పాటను మళ్లీ 2004లో ప్రభాస్, ఆర్తీ అగర్వాల్ నటించిన 'అడవి రాముడు' సినిమా కోసం రిమేక్ చేశారు.
వానా వానా వెల్లువాయే
చిరంజీవి గారి హిట్టు సినిమాల్లో ఒకటైన 'గ్యాంగ్ లీడర్' సినిమాలోని పాట ఇది. 1991లో రెయిన్ సాంగ్ లా తెరకెక్కిన ఈ పాటను మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి తమ డాన్స్ తో ఎక్కడికో తీసుకెళ్లారు. తిరిగి 2012లో 'రచ్చ' సినిమా కోసం రీమేక్ చేసిన ఈ పాటకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మిల్కీ బ్యూటీ తమన్నా కలిసి రఫ్ఫాడించారు.
ఆకు చాటు పిందే తడిసే
1979లో అందాల తార శ్రీదేవీ, సీనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన 'వేటగాడు' సినిమాలోని పాట ఇది. తిరిగి 2002లో 'అల్లరి రాముడు' చిత్రం కోసం ఈ పాటను '2002 వరకూ చూడలేదే ఇంత సరుకు' అంటూ రిమేక్ చేశారు. రిమేక్ సాంగ్‌లో ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్, ఆర్తీ అగర్వాల్ కలిసి స్టెప్పులేశారు.
బంగారు కోడి పెట్ట
మెగాస్టార్ చిరంజీవి, నగ్మా కలిసి నటించిన 'ఘరానా మొగుడు' చిత్రంలోని పాట ఇది. 1992లో రిలీజ్ అయిన ఈ పాటను తిరిగి 2004లో రామ్ చరణ్ 'మగధీర' సినిమాలో రిమేక్ చేశారు.