Pawan Kalyan OG Movie :పవర్ స్టార్ పవన్ కల్యాణ్- సుజీత్ కాంబోలో తెరకెక్కుతున్న 'ఓజీ' సినిమాపై అభిమానులకు రోజురోజుకు ఆత్రుత పెరిగిపోతుంది. ఇప్పిటికే రిలీజైన టీజర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేసింది. దీంతో హీరో పవన్ కల్యాణ్ ఏ సభకు హాజరైనా, ఎక్కడ కనిపించినా ఫ్యాన్స్ 'ఓజీ', 'ఓజీ' అంటూ అరుస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ అభిమానులకు ఓ రిక్వెస్ట్ చేశారు. ఇంకొన్ని రోజులు ఓపిగ్గా ఉండాలని తెలిపారు. 'ఆయన్ని ఇబ్బంది పెట్టకండ్రా, ఇంకొంచెం టైమ్ ఉంది. అల్లాడిద్దాం థియేటర్లలో' అని ఫ్యాన్స్‌కు ఫన్నీ రిక్వెస్ట్ చేసింది.
'OG సినిమాపై మీరు చూపిస్తున్న అభిమానం, ప్రేమ మా అదృష్టంగా భావిస్తున్నాము. ఓజీ సినిమాను మీ ముందుకు తీసుకురావడానికి నిరంతరం పని చేస్తున్నాం. కానీ, మీరు పవన్ కల్యాన్ గారు పొలిటికల్ సభలకు వెళ్లినప్పుడు సమయం, సందర్భం చూడకుండా ఓజీ ఓజీ అని అరవడం, వారిని ఇబ్బంది పెట్టడం సరైంది కాదు. వారు ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా రాష్ట్ర భవిష్యత్ కోసం ఎంత కష్టపడుతున్నారో మనందరికీ తెలుసు. ఆ స్థానాన్ని, స్థాయిని గౌరవించడం మన కనీస బాధ్యత. అందుకని ఇంకొన్ని రోజులు ఓపికగా ఉందాం. 2025 -OG పండుగ వైభవంగా నిలుస్తుందని మేము గట్టిగా నమ్మకతున్నాం' అని నిర్మాణ సంస్థ డివివి దానయ్య ఎంటర్టైన్మెంట్ పోస్ట్ షేర్ చేసింది.
ఇదీ జరిగింది
పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఇటీవల ఓ మీడియాతో సీరియస్‌గా మాట్లాడుతుండగా అక్కడే ఉన్న ఫ్యాన్స్ ఓజీ ఓజీ అని అరిచారు. అభిమానుల స్లోగన్స్‌తో అసహనానికి గురైన పవన్ 'ఆగండయ్యా. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు' అని అన్నారు. ఈ క్రమంలోనే మేకర్స్ ఈ విధంగా ఫ్యాన్స్‌కు సర్ది చెప్పారు.