తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

లోకేశ్ యూనివర్స్‌లోకి మరో హీరో కన్ఫామ్​​ - మోస్ట్ డేంజరస్​ సోల్జర్​గా లారెన్స్​ - LOKESH KANAGARAJ LAWRENCE

లోకేశ్ కనగరాజ్​ - రాఘవ లారెన్స్​ సినిమాకు సంబంధించి పవర్​ఫుల్ అప్డేట్ ఇదే!

Lokesh kanagaraj Lawrence
Lokesh kanagaraj Lawrence (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 30, 2024, 11:38 AM IST

యాక్టర్ కమ్ డైరక్టర్, డ్యాన్సర్ అయిన మల్టీ టాలెంటెడ్ రాఘవ లారెన్స్ బర్త్ డే సందర్భంగా అదిరిపోయే అనౌన్స్‌మెంట్ వచ్చింది. లోకేశ్ - లారెన్స్ కలిసి పని చేయబోయే సినిమా 'బెంజ్' అంటూ జరిగిన ప్రచారాన్ని కన్ఫామ్ చేస్తూ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్​. డైరక్టర్ లోకేశ్ కనగరాజ్ స్వయంగా కనిపిస్తూ ప్రకటించిన వీడియోలో, లోకి యూనివర్స్‌లోకి వెల్కమ్ మాస్టర్ అంటూ లారెన్స్ ఎంట్రీని కన్ఫామ్ చేశారు. దీంతో లోకేశ్ ఫ్యాన్స్‌తో పాటు లారెన్స్ అభిమానుల్లోనూ అఫీషియల్‌గా క్లారిటీ వచ్చేసింది. హెల్మెట్ మీద 'బెంజ్' అనే లోగో చూపిస్తూ టైటిల్ కన్ఫామ్ చేశారు లేకశ్​. 'ఓ కారణంతో మోస్ట్ డేంజరస్​ సోల్జర్​గా మారిన యోధుడు' అని క్యాప్షన్ రాసుకొచ్చారు.

ఈ అనౌన్స్‌మెంట్ లోకేశ్‌తో పాటు లారెన్స్ సోషల్ మీడియాల్లో పోస్ట్ చేయగానే క్షణాల్లో వైరల్ అయింది. ఇది చూసిన వారంతా లోకి సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగానే దీన్ని తెరకెక్కిస్తున్నారని చెబుతున్నారు. ఈ సినిమాకు రెమో, సుల్తాన్ సినిమాలకు దర్శకత్వం వహించిన బక్కీయరాజ్ డైరక్ట్ చేస్తున్నారు. లోకేశ్ కనగరాజ్ స్టోరీ లైన్ అందించి, తన సొంత బ్యానర్‌లోనే సినిమాను రూపొందిస్తున్నారు. అంటే ఈ సినిమా రిలీజ్ తర్వాత లోకేశ్ యూనివర్స్‌లో కార్తీ, కమల్, సూర్య, విజయ్​తో పాటు ఐదో బడా హీరోగా నిలవనున్నారు లారెన్స్.

దీంతో పాటుగా రాఘవ లారెన్స్ తన 48వ పుట్టిన రోజు సందర్భంగా స్వయంగా తన 25వ ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. 'కాల బైరవ' అనే టైటిల్‌తో RL25 వస్తుందని, మీ అందరి ఆశీర్వాదం కావాలంటూ ఇన్ స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈ చిత్రానికి రమేశ్ వర్మ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుందట. ఇదే కాకుండా 'అధిగారం', 'దుర్గ', 'బుల్లెట్' లాంటి బడా ప్రాజెక్టులను కూడా లారెన్స్ పూర్తి చేయాల్సి ఉంది. కాగా, 2023లో దీపావళి గిఫ్ట్‌గా రిలీజ్ అయిన జిగర్తాండ డబుల్X తర్వాత లారెన్స్‌కు సంబంధించి ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు.

ABOUT THE AUTHOR

...view details