NTR about Devara Title : యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పవర్ ఫుల్ యాక్షన్ మూవీ 'దేవర'. కొరటాల శివ దర్శకుడు. సెప్టెంబర్ 27న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. దీంతో సోషల్ మీడియా అంతా ఈ పేరే తెగ ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా ఆడియెన్స్‌కు ఈ సినిమా రీచ్ అవ్వాలని తారక్ వరుసగా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. గ్యాప్ లేకుండా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుంటే టెన్షన్‌గా కూడా ఉందని చెప్పారు. కానీ సినిమాపై నమ్మకంగా ఉన్నానని, మూవీటీమ్ ఎంతో కష్టపడి పని చేసిందని పేర్కొన్నారు.
అయితే తాజాగా తాను దేవర అనే టైటిల్ ఎందుకు పెట్టారో చెప్పారు తారక్. ఆర్‌ఆర్‌ఆర్ లాగా, దేశవ్యాప్తంగా ఆడియెన్స్‌కు చేరువయ్యేలా టైటిల్ పెట్టాలనుకున్నట్లు, అందుకే దేవరను ఫైనల్‌ను చేసినట్లు తెలిపారు. దేవర అంటే దేవుడు అని అర్థం అన్నారు.
ఆ దర్శకుడు చెప్పడంతో - హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను మొదట అనుకోలేదని చెప్పారు టైగర్ ఎన్టీఆర్. కానీ ఆ తర్వాత బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఒకసారి కాల్ చేసి, జాన్వీ మంచి నటి, ఆమెను ఈ చిత్రంలో తీసుకుంటే బాగుంటుంది అని చెప్పారు. అయితే ఆ తర్వాత కూడా తాము ఆమెను తీసుకోవాలని అనుకోలేదని, కానీ స్క్రిప్ట్ రైటింగ్ కంప్లీట్ అయ్యే సమయానికి ఆమె టీమ్‌లోకి వచ్చినట్లు తెలిపారు. సంగీత దర్శకుడు అనిరుధ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంటుందని, అతను అద్భుతమైన వ్యక్తి అని ప్రశంసించారు.