Netflix Rajamouli Documentary : దర్శకధీరుడు రాజమౌళిని ప్రభాస్ పిచ్చోడని అంటున్నారు! ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ జక్కన్నపై మోడ్రన్ మాస్టర్స్ పేరుతో డాక్యుమెంటరీ సిరీస్ రూపొందించింది. ఇందులో భాగంగా రాజమౌళితో కలిసి పని చేసిన జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, కీరవాణి, రమా రాజమౌళి లాంటి వాళ్లు జక్కన గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. అలా ప్రభాస్ మాట్లాడుతూ ఇలాంటి దర్శకుడిని నేను ఇప్పటివరకు చూడలేదు. ఆయనకు సినిమాలంటే పిచ్చి అంటూ చెప్పుకొచ్చారు. హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరూన్, బాలీవుడ్ ప్రముఖుడు కరణ్ జోహర్‌లు కూడా వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. ఆగస్టు 2 నుంచి రూ.199 అద్దె ప్రాతిపదికన నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఇది స్ట్రీమింగ్ కానుంది. తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇది అది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
- రాజమౌళితో పని చేసిన వారందరూ ఆయన్ని పని రాక్షసుడని అంటుంటారు. - రమా రాజమౌళి
- ఇప్పటివరకు ఎవరూ చెప్పనవి, చూపనివి కథలను ప్రపంచానికి చెప్పడం కోసమే రాజమౌళి పుట్టారు. - ఎన్టీఆర్
- ఇలాంటి డైరెక్టర్‌ను నేను ఇప్పటివరకు చూడలేదు. సినిమాలంటే ఆయనకు పిచ్చి. - ప్రభాస్
- ఈ డైరెక్టర్ ఓ లెజెండ్ - కరణ్ జోహార్
- ఆయన సినిమాల్లో నన్ను నేను చూసుకొని ఎంతగానో ఆశ్చర్యపోతాను. - రామ్‌చరణ్
- జక్కన్నకు సాధ్యం కానిదంటూ ఏమీ లేదు. ఎవరితోనైనా పని చేయగలుగుతారు. ఆయనంటే నాకెంతో గౌరవం - జేమ్స్ కామెరూన్
Rajamouli Movies : కాగా, రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన స్టూడెంట్ నెం1 చిత్రంతో దర్శకుడిగా మారారు. తొలి చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న ఆయన ఆ తర్వాత సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ వంటి చిత్రాలతో వరుస బ్లాక్ బస్టర్‌లను ఖాతాలో వేసుకున్నారు. 2015లో వచ్చిన బాహుబలితో తన పేరును ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకునేలా చేశారు. బాహుబలి 2తో మరింత క్రేజ్ సంపాదించుకున్నారు. ఆర్ఆర్ఆర్తో అంతర్జాతీయ సినీ ప్రముఖులను ఆకట్టుకున్నారు.