తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

చైనీస్‌, ఇండోనేషియా, కొరియన్​లో రీమేకైన తొలి ఇండియన్​ మూవీ ఈయనదే! - నెరు మూవీ ట్రెండింగ్

ఆ ఇండియన్ డైరెక్టర్​ తెరకెక్కించిన సినిమా చైనీస్‌, ఇండోనేషియా, కొరియాలోనూ రీమేక్‌ అయింది. ఆ డైరెక్టర్​ ఎవరో చెప్పగలరా?

చైనీస్‌, ఇండోనేషియా, కొరియన్​లో రీమేకైన తొలి ఇండియన్​ మూవీ ఆయనదే!
చైనీస్‌, ఇండోనేషియా, కొరియన్​లో రీమేకైన తొలి ఇండియన్​ మూవీ ఆయనదే!

By ETV Bharat Telugu Team

Published : Jan 31, 2024, 11:17 AM IST

Neru Movie Jetu Joseph: ప్రస్తుతం ఓటీటీలో ఆడియెన్స్​ను బాగా మెప్పిస్తున్న సినిమా 'నెరు'. డిస్నీ + హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ కోర్టు డ్రామా ప్రేక్షకులను కట్టి పడేస్తోంది. దీన్ని తెరకెక్కించింది జీతూ జోసెఫ్​. ప్రేక్షకుడిని కుర్చీ నుంచి కదలకుండా కూర్చోబెట్టడం ఈయన ప్రత్యేకత. కాలేజ్​ డేస్​ నుంచి సినిమాలపై ఆసక్తి పెంచుకున్న జీతూ ఆ తర్వాత డైరెక్టర్​గా మారారు.

'డిటెక్టివ్' చిత్రంతో కెరీర్‌ను ప్రారంభించిన జీతూ జోసెఫ్‌ విభిన్న జానర్లలో సినిమాలను తెరకెక్కించారు. ఇప్పటివరకూ ఆయన 17 సినిమాలు చేయగా వాటిలో మూడే ఫ్లాప్‌ అయ్యాయి. లైఫ్‌ ఆఫ్ జోసుట్టీ, మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ రౌడీ, ది బాడీ మాత్రమే ఆదరణను దక్కించుకోలేకపోయాయి. మిగిలినవన్నీ హిట్స్​ అవ్వడం విశేషం. ఆయన కెరీర్​లో 'దృశ్యం' చిత్రం ఆల్‌ టైమ్‌ హిట్‌. ఇక రీసెంట్​గా వచ్చిన 'నెరు' కూడా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకుంది. కేవలం రూ.12కోట్ల బడ్జెట్​తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.85కోట్లు వసూలు చేసింది. ఓటీటీ రైట్స్‌, శాటిలైట్‌ రైట్స్‌ కూడా కలిపి మొత్తంగా రూ.100కోట్ల వరకు వసూలు చేసింది.

అయితే జీతూ తన కెరీర్​లో ఆల్​ టైమ్​ హిట్ అందుకున్న 'దృశ్యం' సినిమాను కేరళలో జరిగిన ఓ హత్య కేసు ప్రేరణతో తీశారు. కాకపోతే ఆ రియల్ కేస్​లో నిందితుడు పోలీసులకు దొరికిపోయాడు. అలా దొరక్కుండా తన కుటుంబం కోసం చివరివరకు అతడు పోరాడితే ఎలా ఉంటుందన్నదే ఈ దృశ్యం కథ! ఇందులో మోహన్‌లాల్‌ (తెలుగులో వెంకటేశ్‌) ప్రధాన పాత్రలో నటించారు. వీళ్ల పాత్రను తన తండ్రిని స్ఫూర్తిగా తీసుకుని తీర్చిదిద్దారు జీతూ.

జోసెఫ్‌ నాన్న ఎమ్మెల్యే. అయినా ఆయన బస్సుల్లోనే జర్నీ చేసేవారు. ఏడాదికో రెండేళ్లకో తప్ప దుస్తులూ కొనేవారు కాదు. కరెంటూ, నీళ్లను అస్సలు వృథా చేసేవారు కాదు. ఎవరైనా చేసినా సహించేవారు కాదు. ఈ మొత్తాన్ని 'దృశ్యం' కథలో భాగం చేశారు జీతూ. దీనికి మిడిల్ క్లాస్​ ఫ్యామిలిలోని భయాలనీ, తమవాళ్ల కోసం ఎంతకైనా పోరాడే తెగువనీ కలిపారు. ఈ అంశాల్నీ దృశ్యం సినిమాను మంచి థ్రిల్లర్​గా నిలబెట్టింది. తెలుగు, తమిళం, హిందీలోనే కాదు సింహళంలో తీసినప్పటికీ పెద్ద హిట్‌ సాధించింది. చైనీస్‌ మాండరిన్‌ భాషలో రీమేక్ అయిన మొదటి భారతీయ చిత్రంగానూ రికార్డుకెక్కింది. ప్రస్తుతం ఇండోనేషియా, కొరియన్‌ భాషల్లోనూ 'దృశ్యం' రీమేక్‌ చేస్తున్నారు.

వామ్మో 'పుష్ప 2' బడ్జెట్​ అంత పెరిగిందా? - ఏకంగా ఎన్ని కోట్లంటే?

వరుసగా 10 ఫ్లాప్స్​- అయినా కోట్లలో రెమ్యునరేషన్- ఆ స్టార్​ హీరోయిన్ ఎవరంటే?

ABOUT THE AUTHOR

...view details