తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

NBK109 : ఆ రోజు ఫ్యాన్స్​కు బాలయ్య డబుల్ ట్రీట్​! - NBK109 టీజర్ రిలీజ్ డేట్

NBK109 Teaser : నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న NBK109 మూవీటీమ్ ఫ్యాన్స్​కు డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతోందని తెలుస్తోంది. ఆ వివరాలు.

ఎన్​బీకే 109 టీజర్ రిలీజ్ డేట్
ఎన్​బీకే 109 టీజర్ రిలీజ్ డేట్

By ETV Bharat Telugu Team

Published : Feb 29, 2024, 6:31 AM IST

NBK109 Teaser : నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆరు పదుల వయసులోనూ కుర్ర హీరోలకు దీటుగా సినిమాలు చేస్తూ వరుస సక్సెస్​లను అందుకుంటున్నారు. గత ఏడాది వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో రూ.100కోట్లకుపైగా భారీ బ్లాక్ బస్టర్లను అందుకున్న ఆయన ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో NBK109 అనే సినిమా చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోందీ చిత్రం. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

మెగాస్టార్ చిరంజీవికి వాల్తేరు వీరయ్య లాంటి బిగ్ మాస్ హిట్ అందించిన దర్శకుడు బాబీ ఈసారి బాలయ్యతో కలిసి అంతకుమించిన బ్లాక్ బస్టర్ హిట్ అందుకునేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ NBK109 ప్రాజెక్ట్ నుంచి మోషన్ పోస్టర్ తప్ప మరే ఇతర అప్డేట్స్ బయటకురాలేదు. కానీ త్వరలోనే చిత్రీకరణను పూర్తి చేసి వరుస అప్డేట్స్ ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారని తెలిసింది.

అయితే తాజాగా ఈ NBK109 విడుదల తేదీ గురించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం ప్రారంభమైంది. ఈ సినిమాను జులైలో విడుదల చేసేందుకు మూవీటీమ్​ ప్లాన్ చేస్తోందని తెలిసింది. వాస్తవానికి ఈ చిత్రాన్ని దసరా బరిలో నిలపాలని మేకర్స్ అనుకున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ ఆ సమయంలో ఎన్టీఆర్ దేవర చిత్రంతో పాటు మరో రెండు సినిమాల వరకు రిలీజ్ కాబోతున్నాయి. అంతకన్నా ముందే ఆగస్ట్​లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం పుష్ప 2, సెప్టెంబర్​లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG చిత్రాలు రాబోతున్నాయి. దీంతో జులై 19 లేదా 26 తేదీల్లో NBK109 విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందింది. త్వరలోనే ఈ రిలీజ్ డేట్​ను అధికారికంగా ప్రకటించనున్నారట. అలానే ఈ మహా శివరాత్రి సందర్భంగా NBK109 నుంచి ఫ్యాన్స్​కు డబుల్ ట్రీట్​ ఇవ్వబోతున్నట్లు తెలిసింది. టైటిల్ పోస్టర్​తో పాటు టీజర్​ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం అందింది. టీజర్​లోనే సినిమా విడుదల తేదీని కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

బాయ్ ఫ్రెండ్​తో సీక్రెట్ మ్యారేజ్- హీరోయిన్ తాప్సీ వారికి ఇచ్చి పడేసింది!

ప్రైవేట్​ జెట్​, కాస్ట్​లీ కార్లు - సౌత్​లో రిచెస్ట్​ హీరోయిన్ ఎవరంటే ?

ABOUT THE AUTHOR

...view details