Nayanthara Dhanush Issue :కోలీవుడ్ సూపర్ స్టార్ నయనతార, హీరో ధనుష్‌పై చేసిన విమర్శలు ప్రస్తుతం సినీవర్గాల్లో హాట్ టాపిగ్గా మారాయి. ఈ నేపథ్యంలో నయన్ భర్త విఘ్నేశ్ శివన్ కూడా ధనుష్‌ను ఉద్దేశిస్తూ రీసెంట్గా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. ఆయన పోస్ట్ చేసిన కొద్ది సేపటికీ ఇది ఇంటర్నెట్లో బాగా వైరలైంది. అయితే విఘ్నేశ్ ఈ పోస్ట్‌ను తొలగించారు.
'ద్వేషాన్ని కాదు, ప్రేమను పంచండి. మీ కోసం పడి చచ్చిపోయే అమాయక అభిమానుల కోసమైనా మీరు మారండి. మనుషులు మారాలని, ఎదుటివారి ఆనందాల్లో కూడా సంతోషం వెతుక్కోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను' అని విఘ్నేశ్ ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు. కానీ, ఆయన దీనిని తొలగించడం గమనార్హం. అలాగే ఈ పోస్టు ఎందుకు డిలీట్ చేశారో కూడా తెలియదు.
ఇదీ జరిగింది
విఘ్నేశ్ శివన్ డైరెక్షన్లో నయనతార హీరోయిన్‌గా నటించిన తొలి చిత్రం 'నానుమ్ రౌడీ దానే'. ఈ సినిమాకు ధనుష్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా సమయంలోనే విఘ్నేశ్ - నయన్ ప్రేమ మొదలైంది. పెద్దల అంగీకారంతో 2022లో పెళ్లి చేసుకున్నారు. అయితే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ నయన్ కెరీర్, ప్రేమ, పెళ్లి ఇలా పలు అంశాలతో కూడిన ఓ డాక్యుమెంటరీని సిద్ధం చేసింది.