Trans woman Navya Singh : ప్రతిష్టాత్మక 'మిస్ యూనివర్స్ ఇండియా 2024' పోటీకి మహారాష్ట్ర నుంచి ట్రాన్స్ ఉమెన్ నవ్య సింగ్ ఎంపికైంది. మొత్తం వంద మంది పోటీపడగా, న్యాయనిర్ణేతలు 11 మందిని ఎంపిక చేశారు. వారిలో నవ్య సింగ్ ఎంపికయ్యారు. మహారాష్ట్ర నుంచి పోటీల్లో పాల్గొంటున్న మెుదటి ట్రాన్స్ మహిళగా నవ్య సింగ్ చరిత్రకు ఎక్కనున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆమెకు అభినంధనలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ సారి జరగబోయే మిస్ యూనివర్స్ ఇండియా పోటీలు ప్రత్యేకత సంతరించుకోనున్నాయి. ఎందుకంటే నవ్యతో పాటుగా మరో ఇద్దురు సైతం ట్రాన్స్ మహిళలు ఈ పోటీలో పాల్గొననున్నారు. చెన్నై, దిల్లీకి చెందిన మరో ఇద్దరు సైతం ఈ పోటీలకు ఎంపికయ్యారు.
'మిస్ యూనివర్స్ ఇండియా 2024' ఫైనల్కు తన ఎంపికపై నవ్య సింగ్ స్పందించారు. "ట్రాన్స్ మహిళలను స్వాగతించే వేధికలో భాగం కావడం నాకే కాదు,అణగారిన వర్గాలకు ఇది గొప్ప ముందడగు. ఇప్పుడు మనం సమ సమాజం వైపు అడుగులు వేస్తున్నాం అనిపిస్తోంది. నా ప్రయాణం ఇతరులకు ఆదర్శం కావాలి. అలాగే వారు అనుకునే మార్గంలో నడవడానికి తోడ్పడాలి. వారు తమ హక్కుల కోసం పోరాడటానికి స్పూర్తిని ఇస్తుంది'' అని నవ్య సింగ్ తెలిపారు.