Natasha Doshi Marriage :ఫిల్మ్ ఇండస్ట్రీలో బాజాభజంత్రీల మోత గట్టిగా వినిపిస్తోంది. కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకుంటుంటే మరికొంతమంది అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఇప్పటికే గత నెల రోజుల్లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు దాదాపు ఐదు ఆరు జంటలు పెళ్లి పీటలెక్కాయి. తాజాగా మరో తెలుగు హీరోయిన్ శుభవార్త వినిపించింది.
ఆమెనే ముంబయికి చెందిన నటాషా దోషి. 1993 ముంబయిలో పుట్టిన ఈ భామ చదువు పూర్తయ్యాక సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మలయాళ చిత్రాలతో నటిగా కెరీర్‌ను ప్రారంభించింది. 2012 నుంచి 2017 వరకు మాంత్రికన్,హైడ్ అండ్ సీక్, కాల్ మీ, కాపుచీనో వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది.
Natasha Doshi Movies : అనంతరం 2018లో నటసింహం బాలయ్య నటించిన జై సింహా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. దీంతో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. కేవలం సీనియర్ నటుడు శ్రీకాంత్‌తో కలిసి కోతలరాయుడులో హీరోయిన్గా, నందమూరి హీరో కల్యాణ్ రామ్‌తో కలిసి ఎంతమంచి వాడవురా చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. ఆ తర్వాత కనపడలేదు.