తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

టైటిల్​లో 'శనివారం'- రిలీజ్ 'గురువారం-' ఎందుకలా?- నాని ఆన్సర్ ఇదే - Nani Saripodhaa Sanivaraam - NANI SARIPODHAA SANIVARAAM

Nani Saripodhaa Sanivaraam: స్టార్ హీరో నాని ప్రస్తుతం తన లేటెస్ట్ సినిమా 'సరిపోదా శనివారం' మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. తాజాగా మూవీ ప్రమోషన్స్​లో రిలీజ్ గురించి ఎదురైన ఫన్నీ ప్రశ్నకు నాని ఏమన్నారంటే?

Saripodhaa Sanivaraam
Saripodhaa Sanivaraam (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 21, 2024, 3:54 PM IST

Nani Saripodhaa Sanivaraam:నేచురల్‌ స్టార్‌ నాని- వివేక్ ఆత్రేయ కాంబోలో రానున్న యాక్షన్ డ్రామా మూవీ 'సరిపోదా శనివారం'. ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్​గా ప్రియాంక మోహన్ నటించింది. ప్రధాన పాత్రలో ఎస్ జె సూర్య నటించారు.ఇక ఆగస్టు 29 (గురువారం)న ఈ మూవీ తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్​గా రిలీజ్‌ కానుంది. ఈ క్రమంలో మూవీటీమ్ ప్రమోషన్స్​లో బిజీగా ఉంది.

అయితే ప్రమోషన్స్​లో నానికి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. 'సినిమా స్టోరీ అంతా శనివారం మీద ఆధారపడింది. మరి గురువారం రిలీజ్ చేస్తున్నారు' అని మీడియా సరదగా అడిగింది. దీనికి నాని 'ఏం చేద్దాం అంటారు మరి? శనివారం తీసేద్దామా?' అని నవ్వుతు సమాధానం ఇచ్చారు. 'స్టోరీ శనివారంపై ఉన్నంత మాత్రానా అప్పుడే రిలీజ్ చేయాలని ఏం లేదండి' అని నాని అన్నారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడే
కాగా, ఈ ప్రమోషన్స్​లోనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్​పై హీరో నాని క్లారిటీ ఇచ్చారు. ఆగస్టు 24 శనివారం రోజున ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్నట్లు నాని చెప్పారు. ఇక రిలీజ్ రోజు మార్నింగ్ షోకు హైదరాబాద్ 'సుదర్శన్ థియేటర్'ను సందర్శించనున్నట్లు నాని చెప్పారు. ఫ్యాన్స్​తో కలిసి తాను సినిమా చూడనున్నట్లు పేర్కొన్నారు.

'కలువడానికి వచ్చే వాళ్లు అలా రావాలి'
నాని చేయికి ఎర్ర చున్నీ కట్టుకొని సినిమా ప్రమోషన్స్​లో కనిపించారు. అయితే మూవీలో విలన్​ ఎదురుపడినప్పుడు గుర్తుపట్టకూడదని నాని ఈ ఎర్ర చున్నీతో మొహం కవర్ చేసుకుంటారంట. ఎరుపు రంగు అనేది కోపానికి ప్రతీక అని సినిమాలో చూపించారు. అందుకే నాని ప్రమోషన్స్​లోనూ ఎరుపు రంగును హైలైట్ చేస్తూ కనిపించారు. ఇక ఆర్​టీసీ క్రాస్​ రోడ్స్​లో మార్నింగ్​షో సుదర్శన్ థియేటర్​కు వచ్చేవాళ్లంతా ఎరుపు చున్నీ ఒకటి కట్టుకొని రావాలని నాని ఫ్యాన్స్​కు పిలుపు నిచ్చారు.

కాగా, డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్​పై డీడీవీ దానయ్య ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.

కానిస్టేబుల్​ చారులత ఎంట్రీ - 'సరిపోదా శనివారం'లో ఇంట్రెస్టింగ్​గా ప్రియాంక రోల్! - Priyanka Arul Mohan Nani Movie

'కోపాన్ని వారంలో ఒక్కరోజు మాత్రమే చూపిస్తాడు' - ఆసక్తికంగా నాని అప్​కమింగ్ మూవీ టీజర్​

ABOUT THE AUTHOR

...view details