Saripodhaa Sanivaaram Collection :నేచురల్ స్టార్ నాని- వివేక్ ఆత్రేయ కాంబోలో తెరకెక్కిన 'సరిపోదా శనివారం' తాజాగా రూ .100 కోట్ల క్లబ్లో చేరింది. ఆగస్టు 29న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తూ, తాజాగా రూ. 100 కోట్ల మార్క్ అందుకున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో 'బాక్సాఫీస్ శివ తాండవమే' అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. 'ఇప్పుడు సరిపోయింది. మీకు (ప్రేక్షకులు) థ్యాంక్స్ చెప్పము. మీరంతా ఓ ఫ్యామిలీలాగా ఆదరింది, బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందించారు. పోయారు మొత్తం పోయారు' అని క్యాప్షన్ రాసుకొచ్చారు.
ఇక ఈ సినిమాలో సీనియర్ నటుడు యస్ జే సూర్య కీలక పాక్ర పోషించారు. ఆయన పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నాని- సూర్య మధ్య యాక్షన్ సీన్స్ సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. ఇక నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటించింది. సీనియర్ డైరెక్టర్, నటుడు యస్ జే సూర్య కీలక పాత్ర పోషించారు. ఆయన పాత్రకు ఆల్ ఓవర్ మంచి రెస్పాన్స్ లభించింది. ఇక డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమా రూపొందించారు. కాగా, నాని కెరీర్లో వంద కోట్ల మార్క్ దాటడం ఇది రెండోసారి. గతేడాది దసరా సినిమాతో నాని తొలిసారి రూ.100 కోట్ల క్లబ్లో చేరారు.