తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

నాని ఫ్యాన్స్​కు క్రేజీ న్యూస్- 'పిల్ల జమిందార్' సీక్వెల్​కు మేకర్స్ ప్లాన్!

నేచురల్ స్టార్ నాని బ్లాక్​బస్టర్ సీక్వెల్- పిల్ల జమిందార్ 2 ప్లాన్స్ రివీల్

Pilla Zamindar 2
Pilla Zamindar 2 (Source: ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 11 hours ago

Pilla Zamindar 2 :నేచురల్‌ స్టార్‌ నాని ఫ్యాన్స్‌కి క్రేజీ న్యూస్. అదేంటంటే నాని సూపర్‌ హిట్‌ సినిమా 'పిల్ల జమీందార్‌'కి సీక్వెల్‌ రాబోతోంది. ఇందులో కూడా నాని హీరోగా నటిస్తున్నారు. కొన్ని నివేదికల మేరకు, 2011లో రిలీజైన 'పిల్ల జమీందార్‌'కి సీక్వెల్ తీస్తున్నట్లు ఆ సినిమా ప్రొడ్యూస్​ర్ డి.ఎస్‌.రావు తెలిపారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్లు తెలిపారు.

జి.అశోక్ దర్శకత్వం వహించిన పిల్ల జమీందార్‌లో నానితో పాటు హరిప్రియ, బిందుమాధవి, ధన్​రాజ్, రావు రమేష్, సత్య, వెన్నెల కిషోర్ తదితరులు నటించారు. 2011లో రిలీజైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు సీక్వెల్‌ రానుందనే వార్త నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

డైరెక్టర్ అశోక్‌ స్టార్ హీరోయిన్​ అనుష్కతో 'భాగమతి' సినిమా తీసి హిట్ సొంతం చేసుకున్నారు. అదే సినిమాను హిందీలో రీమేక్ చేశారు. ప్రస్తుతం హిందీలో ఒక మూవీ చేస్తున్నారు. మరి పిల్ల జమీందార్ సీక్వెల్‌ ఆయనే చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. దర్శకత్వం ఎవరు వహిస్తారు? అనే అంశంపై స్పష్టత లేదు.

నాని ఇటీవల 'సరిపోదా శనివారం' మూవీతో హిట్‌ అందుకున్నారు. ప్రస్తుతం 'హిట్‌ 3' షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. దీని తర్వాత 'దసరా' దర్శకుడు శ్రీకాంత్ ఒదెలాతో మరో సినిమా చేయనున్నారు. ఈ కాంబోలో రానున్న రెండో సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. పైగా ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్‌ అందిస్తున్నారు.

దసరా అవార్డుల పండగ
'దసరా' సినిమాతో నాని రూ.100 కోట్ల క్లబ్​లో చేరారు. ఈ సినిమా మంచి విజయంతోపాటు అవార్డులు కూడా సాధించింది. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ మూవీ రాబోతోంది. దసరా పండగ సందర్భంగా ఈ సినిమాని ప్రారంభించారు. ఈసారి సినిమా 'దసరా'ను మించి ఉంటుదని హీరో నాని అన్నారు. ఈ సినిమాలో నాని మరోసారి సరికొత్త అవతారంలో కనిపించనున్నట్లు మూవీ టీమ్‌ చెబుతోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమా బ్యానర్​పై సుధాకర్‌ చెరుకూరి ఈ మూవీని నిర్మిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details