Hero Nani About Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే హీరో నానికి మంచి అభిప్రాయం ఉంది. అందుకే ఆ మధ్య జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్‌కు మద్దతుగా నిలిచారు. పవన్‌కు మద్దతుగా పోస్ట్ పెట్టి తన అభిమానాన్ని కూడా చాటారు. అయితే తాజాగా పవన్ కల్యాణ్ గురించి నాని మరో సారి మాట్లాడారు. రానా దగ్గుబాటి షోలో పాల్గొన్న ఆయన, పవన్ కల్యాణ్ రాజకీయాల్లోనూ పవర్ స్టారే అని అన్నారు.
"సినిమాల్లో పవన్ కల్యాణ్ స్టార్‌గా ఎలా ఎదిగారో తెలిసిన విషయమే. రాజకీయాల్లోనూ పవన్ అదే స్థాయిలో ఎదిగారు. అక్కడ కూడా పవర్ స్టార్ అని నిరూపించుకున్నారు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు." అని నాని అన్నారు.
ఈ కామెంట్స్‌పై రానా కూడా స్పందించారు. "పవన్ చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. ఆయన నిజంగానే సూపర్ స్టార్. రాజకీయాలు కూడా సినిమాల్లాగే ఉన్నాయి." అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో నానితో పాటు ప్రియాంక అరుల్ మోహన్ కూడా పాల్గొని సందడి చేశారు. అలా రానా అడిగిన ప్రశ్నలకు నాని, ప్రియాంక మోహన్ ఆసక్తికర సమాధానాలు చెప్పారు.