Nandamuri Mokshagna Inspiration:టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ లీడ్ రోల్లో నటించిన సినిమా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. ఈ సినిమా మే 31న వరల్డ్‌వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీయూనిట్ హైదరాబాద్‌లో మంగళవారం గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు నందమూరి నటసింహం బాలకృష్ణ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. కాగా, ప్రోగ్రామ్‌లో బాలయ్య తన తనయుడు మోక్షాజ్ఞ సినిమా అరంగేట్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కుమారుడు నందమూరి మోక్షాజ్ఞ తెరంగేట్రం త్వరలోనే ఉండనుందని బాలయ్య క్లూ ఇచ్చారు.'మా అబ్బాయి మోక్షు కూడా రేపు ఇండస్ట్రీకి రావాలి. కానీ, నన్ను కాకుండా విశ్వక్, అడివి శేష్, సిద్ధు జొన్నలగడ్డ లాంటి యువతరాన్నే స్ఫూర్తిగా తీసుకోవాలని తనకు చెబుతుంటా. నటులు నిత్యావసర వస్తువుల్లా ఉండాలి. ఎప్పటికప్పుడు కొత్తదనం అందిస్తూ ఉండాలి. నాన్న నుంచి అదే నేర్చుకున్నా. మోక్షు కూడా అదే అనుసరిస్తాడు' అని బాలయ్య అన్నారు.
'ఇండస్ట్రీలో కొంతమందితోనే నేను సన్నిహితంగా ఉంటాను. అందులో విశ్వక్ ఒకడు. మంచి నటుడు, నాలాగే ఉడుకురక్తం. ప్రతి సినిమాకు కొత్తదనం చూపిస్తాడు. నాకు విశ్వక్ సోదరుడితో సమానం. మమ్మల్ని కవలలు అంటారు. నేను విశ్వక్ కంటే చిన్నవాడినే (నవ్వుతూ). తనకు సినిమా అంటే తపన. ప్రతి సినిమాకు కొత్తదనం ఇవ్వాలనుకుంటాడు. మా ఇద్దరి మధ్య సారూప్యత అదే' అని బాలకృష్ణ అన్నారు.