Kalki 2898 AD OTT Rights : 'కల్కి 2898 ఏడీ' సినిమా ఎట్టకేలకు థియేటర్లలో రిలీజైపోయింది. ప్రీమియర్ షో నుంచి పాజిటివ్ టాక్ దక్కించుకుని అదరగొడుతోంది. దీంతో సోషల్ మీడియా అంతా ఈ సినిమా రివ్యూల(Kalki 2898 AD Rating) గురించే ట్రెండ్ అవుతున్నాయి. సినిమా అద్భుతంగా ఉందంటూ ఎపిక్ బ్లాక్ బస్టర్ అని అందరూ కామెంట్లు పెడుతున్నారు. ఓవర్సీస్లోనూ ఇదే టాక్ నడుస్తోంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
అయితే ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ (ఓటీటీ) హక్కుల వివరాలు తెలిసిపోయాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ సొంతం చేసుకున్నట్లు తెలిసింది. థియేటర్లలో ఈ విషయాన్ని క్లారిటీ ఇచ్చారు. తమ డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్నర్ ప్రైమ్ వీడియో అని 'కల్కి 2898 ఏడీ' సినిమా టైటిల్ కార్డ్స్ ముందు వేశారు మేకర్స్.
Kalki 2898 AD Animation Series : ఇకపోతే 'కల్కి 2898 ఏడీ'లో ప్రభాస్ పాత్ర భైరవ, సూపర్ కార్ బుజ్జి ప్రధాన పాత్రలుగా 'బుజ్జి అండ్ భైరవ' పేరుతో ఒక వెబ్ సిరీస్ రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ మధ్య దానికి సంబంధించిన మొదటి ఎపిసోడ్‌ను అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేశారు. దీనికి మంచి రెస్పాన్సే వచ్చింది. మరొక ఎపిసోడ్ త్వరలోనే విడుదల కానుంది. సినిమా విషయానికొస్తే థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలోకి రానుంది. బాక్సాఫీస్ దగ్గర సినిమా జోరు ఎక్కువ రోజులు కొనసాగితే ఆలస్యంగా కూడా రావొచ్చు.