Kalki 2898 AD Making Video : ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD భారీ స్థాయిలో పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకెళ్తోంది. దీంతో ఈ చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ థియేటర్లకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా సినిమాలోని విజువల్ వండర్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం ఎపిసోడ్ అదిరిపోయిందంటూ అంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయంటూ ప్రశంసిస్తున్నారు(Kalki 2898 AD Review).
ప్రభాస్ – అమితాబ్‌కు మధ్య వచ్చే హై లెవెల్ యాక్షన్ ఫైట్స్ ప్రేక్షకులను తెగ మెప్పిస్తున్నాయి. మరి ఈ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్‌లను డిజైన్ చేసింది ఎవరో తెలుసా? దీని వెనక ఉన్న యాక్షన్ కొరియోగ్రఫీ ఎవరిదో తెలుసా? ఆయన గురించి తెలుపుతూ మెకింగ్ వీడియోను రిలీజ్ చేసింది మూవీటీమ్. ఇంతకీ ఆయనెవరంటే యాండీ లాంగ్ గ్యుఎన్. ఈయన హాంగ్ కాంగ్ మూలాలు ఉన్న జర్మనీకి చెందిన వ్యక్తి. వృత్తి మార్షల్ ఆర్ట్స్ మాస్టర్. చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని స్టంట్ మాస్టర్‌గా మారారు. సూపర్ హీరో జాకీచాన్‌తో కూడా కలిసి పనిచేశారు.
ప్రస్తుతం ఆయన ఇండియన్ సినిమాలకు కూడా యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్‌కు కల్కి చిత్రంతో పరిచయం అయ్యారు. ఈ చిత్రం కోసం యాండీ లాంగ్, తన టీమ్ కలిసి అదిరిపోయే యాక్షన్ విజువల్స్‌ను సృష్టించారు. తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు రీసెంట్‌గానే కల్కి టీమ్‌కు, నాగ్ అశ్విన్‌కు, నిర్మాతకు సోషల్ మీడియాలో థ్యాంక్స్ చెబుతూ యాండీ లాంగ్ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు.