Naga Chaitanya Sobhita Dhulipala wedding Video : అక్కినేని హీరో నాగ చైతన్య - శోభిత ధూళిపాళ్ల త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. మరో వారం రోజుల్లో వీరి పెళ్లి జరగనుంది. అయితే ఈ పెళ్లిని డాక్యుమెంటరీ రూపంలో రూపొందించనున్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ కథనాలపై అక్కినేని టీమ్ స్పందించింది. ఆ ప్రచారంలో ఎటువంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండానే సింపుల్‌గా పెళ్లి నిర్వహించాలనే ఉద్దేశంలో కొత్త జంట ఉందని పేర్కొంది.
కాగా, డిసెంబర్ 4న నాగ చైతన్య - శోభిత ధూళిపాళ్ల పెళ్లి జరగనుంది. అక్కినేని ఫ్యామిలీ సెంటిమెంట్‌గా భావించే హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరి వివాహం జరగనుంది. ఆ స్టూడియోలోని ఏయన్నార్ విగ్రహం ఎదురుగా శోభిత - చైతూ పెళ్లి చేసుకోనున్నారు. ఈ విషయాన్ని రీసెంట్‌గానే ఓ ఇంటర్వ్యూలో చైతన్య పేర్కొన్నారు. ఏయన్నార్ ఆశీస్సులు కొత్త జంటపై ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు కలిసి ఈ డెసిషన్ తీసుకున్నట్లు చైతూ తెలిపారు.
ఈ వివాహ వేడుకకు ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు దాదాపు 300 మంది సన్నిహితులు, సినీ ప్రముఖులు రానున్నారు. సంప్రదాయబద్ధంగా ఈ పెళ్లి వేడుక జరగనుంది. అయితే ఈ క్రమంలోనే ఈ పెళ్లి తంతును డాక్యుమెంటరీ రూపంలో రూపొందించనున్నారని, దీని రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ రూ.50 కోట్లు ఖర్చుపెట్టిందని జోరుగా ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు అక్కినేని టీమ్ స్పందించడం వల్ల అందులో నిజం లేదని తేలింది.