Thandel Bujji Thalli Song Sensation Trending : సముద్రం సాక్షిగా జరిగిన ఒక వాస్తవ ప్రేమ కథను తండేల్ చూపించబోతుంది. నాగ చైతన్య - సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని చందూ మొండేటి తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి రీసెంట్గా రిలీజైన ఫస్ట్ సాంగ్ 'బుజ్జి తల్లి' మెలోడియస్గా సాగుతూ శ్రోతలను, సినీ లవర్స్‌ను బాగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. . ముఖ్యంగా ఈ సాంగ్‌లో చైతన్య, పల్లవి కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో పాటు శ్రోతలను బాగా ఆకట్టుకుంది. దీంతో సోషల్ మీడియాలోనూ ఎక్కడ చూసినా రీల్స్ రూపంలో ఇదే కనపడుతోంది. అలా సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.
అయితే ఈ 'బుజ్జి తల్లి' పాట విడుదలై వారం దాటినా కూడా ఇంకా యూట్యూబ్, ఇన్‌స్టా గ్రామ్‌లో ట్రెండింగ్‌లోనే ఉంటూ తన హవా కొనసాగిస్తోంది. 10 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సంపాదించుకుంది. అలానే యూట్యూబ్‌లో 210కే పైగా లైక్స్‌ను దక్కించుకుంది. ఇన్‌స్టా గ్రామ్‌లో 35కే కన్నా ఎక్కువ రీల్స్‌తో దూసుకెళ్తోంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ తెలుపుతూ ఓ కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. సీజన్ చార్ట్ బాస్టర్ 'లవ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్' బుజ్జి తల్లి అంటూ రాసుకొచ్చింది.