Thandel 100 Crore Club : టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య, సాయి పల్లవి లీడ్ రోల్లో తెరకెక్కిన తండేల్ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. ఈ క్రమంలో తాజగా ఓ అరుదైన రికార్డును నమోదు చేసింది. రిలీజైన 9 రోజుల్లోనే రూ.వంద కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమా ఓవర్సీస్లోనూ జోరుగానే నడుస్తోంది. అక్కడ రీసెంట్గా వన్ మిలియన్ మార్క్‌ను అందుకుంది.
అక్కడ కూడా రికార్డే :
ఇదిలా ఉండగా, ప్రముఖ ఆన్లైన్ టికెట్ బుకింగ్ యాప్'బుక్‌మై షో'లోనూ 'తండేల్' రికార్డు సృష్టించింది. 24 గంటల్లో దాదాపు 2 లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడయ్యాయని, అంతేకాకుండా ఈ సినిమా ఇప్పటికీ ట్రెండింగ్‌లో కొనసాగుతున్నట్లు ఆ సంస్థ తాజాగా తెలిపింది.
స్టోరీ ఏంటంటే :
సముద్రంలోకి చేపల వేటకి వెళ్లిన తోటి మత్స్యకారులందరినీ ముందుకు నడిపించే నాయకుడి పేరే 'తండేల్'. తన తండ్రి తండేల్ కావడం వల్ల చిన్నప్పటి నుంచే ఆయన దగ్గర నుంచి ఓ నాయకుడు ఎలా ఉండాలో నేర్చుకుంటాడు రాజు (నాగచైతన్య). అలా పెద్దయ్యాక రాజు కూడా అందరి కష్టాల్ని వింటూ వాళ్లకోసం నిలబడటం వల్ల అందరూ అతడ్నే 'తండేల్'గా ఎంచుకుంటారు. ఇక రాజుకి తన చిన్నప్పటి ఫ్రెండ్ సత్య (సాయిపల్లవి) అంటే ప్రాణం. బుజ్జితల్లి అంటూ తనను ప్రేమగా పిలుస్తుంటాడు.