Top OTT Telugu Webseries:రొమాన్స్ నుంచి కామెడి వరకూ, థ్రిల్లర్ నుంచి సైన్స్ ఫిక్షన్ వరకూ అన్ని రకాలుగా మిమ్మల్ని ఎంటర్ టైన్ చేసేందుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు పోటీ పడి మరీ కంటెంట్ రిలీజ్ చేస్తున్నాయి. మీకు కావాలసిన జానర్లో అది కూడా తెలుగులో పలు ఓటీటీ వేదికలు మీకు వినోదాన్ని పంచేందుకు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో ఆలస్యం చేయకుండా చూసేద్దామా
కుమారి శ్రీమతి: శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నిత్యా మీనన్ హీరోయిన్గా నటిస్తున్న లేడీ ఓరియెంటెగ్ డ్రామా కుమారి శ్రీమతి. ఇందులో తిరువీర్, గౌతమి, నిరుపమ్ పరిటాల ప్రధాన పాత్రల్లో నటించారు. అమెజాన్ ప్రైమ్ సమర్పణలో వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్‌లపై స్వప్న నిర్మించిన ఈ వెబ్ సిరీస్ 2023లో విడుదల అయింది. తన పూర్వీకుల ఇంటిని కాపాడుకోవడం కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కునే మహిళ పాత్రలో నిత్యా మీనన్ ఇందులో కనిపిస్తోంది.
వధంధీ: ది ఫేబుల్ ఆఫ్ వెలోని:డిసెంబర్ 2022లో విడుదైలన మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ వధంధీ ప్రస్తుతం అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.ఆండ్రూ లూయిస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ లో సంజన కృష్ణమూర్తి, ఎస్జే సూర్య, లైలా, నాజర్, వివేక్ ప్రసన్నలు ప్రధాన పాత్రలో నటించారు.ఓ యువతి హత్య తో మొదలై పూర్తి సస్పెన్స్ తో కొనసాగే ఈ సిరీస్ కు రేటింగ్ బాగానే ఉంది.
ధూత:నాగ చైతన్య- ప్రాచీ దేశాయ్ హీరో హీరోయిన్లుగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ మిస్టరీ త్రిల్లర్ ధూత.పార్వతి తిరువోతు, రవీంద్ర విజయ్, పశుపతిలు ఇందులో ముఖ్య పాత్రల్లో నటించారు. సాగర్ అనే జర్నలిస్టు పాత్రలో నాగచైతన్య నటించారు. డిసెంబర్ 2023లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
మోడ్రన్ లవ్ హైదరాబాద్:జూలై 2022లో విడుదలైన మోడరన్ లవ్ హైదరాబాద్ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నగేష్ కుకునూర్, వెంకటేష్ మహా, ఉదయ్ గుర్రాల, దేవిక బహుధనం లు కలిసి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఆరు కథలతో తెలుగులో చిత్రీకరించారు. ఇందులో నిత్యా మీనన్, రేవతి, సుహాసిని మణిరత్నం, మాళవికా నాయర్, ఉల్కా గుప్తా లు ప్రధాన పాత్రల్లో నటించారు.