Prabhas Kalki 2898 AD Trailer :ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్ కల్కి 2898 ఏడీ. జూన్ 27న రిలీజ్ కానుందీ చిత్రం. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ప్రేక్షకుల అంచనాలను రెట్టింపు చేసే ఎలివేషన్స్‌తో పవర్‌ఫుల్‌గా ఉందీ ప్రచార చిత్రం ట్రైలర్. చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పదుకొణె నటిస్తుండగా, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ట్రైలర్ మీరూ చూసేయండి.
ట్రైలర్ సాగిందిలా - ఈ ట్రైలర్ రన్ టైమ్ మొత్తం 3.10 నిమిషాలు. ఇందులో కల్కి ప్రపంచం, మెయిన్ స్టార్ క్యాస్ట్ క్యారెక్టర్లతో పాటు సినిమా కథను పరిచయం చేశారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ కథ కోసం దర్శకుడు ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టించారని ట్రైలర్ చూస్తే పక్కాగా అర్థమవుతోంది.
భైరవగా ప్రభాస్ లుక్, యాక్షన్, డైలాగ్ డెలివరీ, బుజ్జి (స్పెషల్ కార్) ఎలా ఉంటుందో ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్ ఈ రోజు విడుదల చేసిన ప్రచార చిత్రంలో మరింత విసృత్తంగా చూపించారు. ఒక్కో యాక్షన్ సీన్, విజువల్ హాలీవుడ్ సినిమా చూస్తున్న అనుభూతి కలిగించింది. ప్రభాస్‌తో పాటు మిగతా ప్రధాన తారాగణాన్ని చూపించారు.